Mon Dec 23 2024 07:35:36 GMT+0000 (Coordinated Universal Time)
బాబు పై క్రిమినల్ కేసు కక్ష సాధింపు చర్యే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయడంపై టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు అభ్యంతరం తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయడంపై టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు అభ్యంతరం తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయడంపై టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు అభ్యంతరం తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవడం లేదన్నారు. హిందూ దినపత్రికలో వచ్చిన కథనాన్నే చంద్రబాబు చెప్పారని, దీనిపై కేసులు నమోదు చేయడమేంటని కళా వెంకట్రావు ప్రశ్నించారు. ఎన్నాళ్లు ఇలా అక్రమ కేసులు బనాయిస్తారని కళా వెంకట్రావు నిలదీశారు. శ్మశానాల్లో మృతదేహాలను ఖననం చేయడానికి స్థలం లేని విషయాన్ని గుర్తించని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మాత్రం మానుకోవడం లేదని కళా వెంకట్రావు మండిపడ్డారు.
Next Story