Thu Jan 16 2025 19:51:41 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కమల్ సంచలన ప్రకటన పుట్టినరోజున ఇదే...!!
మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు, విలక్షణ నటుడు కమల్ హాసన్ సంచలన ప్రకటన చేయనున్నారు. తమిళనాట జరగనున్న 20 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమని తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని తన పుట్టిన రోజున కమల్ హాసన్ ప్రకటించనున్నారు. తమిళనాడులో 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో పాటు కరుణానిధి, ఎకే బోస్ మరణాలతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటికి ఆరు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే ఈ 20 స్థానాల్లో పోటీకి అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే, దినకరన్ పార్టీలు పోటీకి సిద్ధమయ్యాయి. తాజాగా కమల్ కూడా తన పార్టీ తరుపున ఈ ఉప ఎన్నికల్లో పోటికి దించడానికి రెడీ అవుతుండటంతో అన్ని పార్టీల్లో కంగారు లేపుతోంది.
Next Story