సీఎం ప్రమాణస్వీకారంలో ఆసక్తికర పరిణామం
మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ప్రమాణస్వీకారం చేవారు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా యువనేత జ్యోతిరాదిత్య సింధియా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని దేవెగౌడ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కర్ణాటక సీఎం కుమారస్వామి, వివిధ పార్టీల నేతలు స్టాలిన్, ఫరూక్ అబ్దుల్లా, ఓమర్ అబ్దుల్లా, శరద్ యాదవ్, మల్లిఖార్జున్ ఖర్గే, దిగ్విజయ్ సింగ్, శరద్ పవార్ తదితరులు హాజరయ్యారు.
ఆ పార్టీల నుంచి.....
మమత బెనర్జీ తరపున తృణమూల్ కాంగ్రెస్ నేత దినేష్ త్రివేది హాజరుకాగా ఎస్పీ, బీఎస్పీ నుంచి ఎవరూ హాజరుకాలేదు. అయితే, ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి తాజా మాజీ ముఖ్యమంత్ర శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా హాజరయ్యారు. ఆయన అందరితో కరచలనం చేయడంతో పాటు కమల్ నాధ్, జ్యోతిరాదిత్య సింధియాలతో కలిసి చేతులు పైకెత్తి అభివాదం చేయడం ఆసక్తికరంగా మారింది.