జగన్ కు ప్రజలపై కక్ష అందుకే
2014 ఎన్నికల్లో అధికారం తనకు ఇవ్వలేదని జగన్ ప్రజలపై కక్ష తీర్చుకున్నట్లు కనపడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తుళ్లూరులో రాజధాని రైతుల సభలో [more]
2014 ఎన్నికల్లో అధికారం తనకు ఇవ్వలేదని జగన్ ప్రజలపై కక్ష తీర్చుకున్నట్లు కనపడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తుళ్లూరులో రాజధాని రైతుల సభలో [more]
2014 ఎన్నికల్లో అధికారం తనకు ఇవ్వలేదని జగన్ ప్రజలపై కక్ష తీర్చుకున్నట్లు కనపడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తుళ్లూరులో రాజధాని రైతుల సభలో ఆయన ప్రసంగించారు. లిక్కర్, డీజిల్ మీద రేట్లు పెంచారన్నారు. ప్రజలపై భారం మోపి పైశాచికానందం పొందుతున్నారన్నారు. నవరత్నాలు అని చెప్పి దోపిడీకి దిగారని కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఇసుక మాఫియా యధేచ్ఛగా చెలరేగిపోతుందన్నారు. పాదయాత్రలో ఎన్నో చెప్పారు కాని, చసింది మాత్రం శూన్యమని తెలిపారు. దురుద్దేశంతోనే జగన్ మూడు రాజధానుల ప్రకటన చేశారన్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.