Mon Dec 23 2024 23:06:02 GMT+0000 (Coordinated Universal Time)
బాబు వ్యాఖ్యలకు కన్నా స్ట్రాంగ్ కౌంటర్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గంటకో డ్రెస్ మారుస్తారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. [more]
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గంటకో డ్రెస్ మారుస్తారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. [more]
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గంటకో డ్రెస్ మారుస్తారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నరేంద్ర మోడీ గంటకో డ్రెస్ మారుస్తారో లేదో తెలియదు కానీ.. చంద్రబాబు మాత్రం ఊసరవెల్లి కన్నా ఘోరంగా రంగులు మారుస్తారని ఆరోపించారు. చంద్రబాబు నిమిషానికి ఒక మాట మారుస్తారని, నిజాయితీగా ఉండే అధికారుల సీటు మారుస్తారని, ఎమ్మెల్యేలను కొని వాళ్ల పార్టీ మారుస్తారని పేర్కొన్నారు. అందుకే ప్రజలు ఈ ఎన్నికలలో చంద్రబాబు సీట్ మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు కన్నా లక్ష్మీనారాయణ ఓ ట్వీట్ చేశారు.
Next Story