Mon Dec 23 2024 05:45:17 GMT+0000 (Coordinated Universal Time)
కొనసాగుతున్న కర్ణాటక పోలింగ్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయింది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయింది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. ఒకే దఫా అన్ని స్థానాలకు పోలింగ్ జరగుతుండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ సారి కర్ణాటకలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
మూడు పార్టీల మధ్య...
కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ప్రధాన పార్టీలుగా పోటీ చేశాయి. హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని కొందరు, లేదు కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి వస్తుందని మరికొన్ని సంస్థలు తమ సర్వేలో వెల్లడించాయి. అయితే కన్నడ ఓటర్ల నాడి ఏంటో ఈరోజు తెలియనుంది. సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ ప్రక్రియ జరగనుంది.
ముఖ్యుల ఓటింగ్...
మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుటుంబ సమేతంగా వచ్చి ఉదయాన్నే ఓటు వేశారు. జయనగర్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాంతి నగర్లోని జోసెఫ్ పాఠశాలలో సినీనటుడు ప్రకాష్ రాజ్ తన ఓటును వేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story