Sun Dec 22 2024 19:26:17 GMT+0000 (Coordinated Universal Time)
ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉ:ది. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం ఎనిమిది గంటల ుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
మధ్యాహ్నానికి తుది ఫలితాలు...
మధ్యాహ్నానికి తుది ఫలితలు వెలువడే అవకాశముంది. ఎన్నికల కౌంటింగ్ కోసం కర్ణాటక వ్యాప్తంగా మొత్తం 36 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటలను జరగకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తును పోలీసులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎవరి ధీమా వారితే...
ఈ నెల 10వ తేదీన పోలింగ్ జరిగింది. అయితే ఈసారి రికార్డు స్థాయిలో 73.19 పోలింగ్ జరిగింది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్‌కు అధిక స్థానాలు దక్కే అవకాశముందని తేల్చాయి. బీజేపీ నేతలు తామే మళ్లీ అధికారంలోకి వస్తున్నామని ధీమాగా ఉన్నారు. మరో వైపు హంగ్ ఏర్పడితే తమదే అధికారం అని జేడీఎస్ అధినేత కుమారస్వామి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. గత 38 ఏళ్లుగా ఒకసారి అధికారంలో ఉన్న పార్టీ మరొకసారి అధికారంలోకి వచ్చింది లేదు. దీంతో కాంగ్రెస్, బీజేపీలు ఎమ్మెల్యేలను క్యాంప్‌లకు తరలించే ప్రయత్నం ప్రారంభించాయి.
Next Story