Fri Dec 20 2024 01:15:56 GMT+0000 (Coordinated Universal Time)
కర్ణాటకలో గెలుపు ఎవరిదంటే?
కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది.ఏబీసీ, సీ ఓటరు సర్వే ప్రకారం కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయంగా కనపడుతుంది.
కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. మే 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అయితే తాజాగా ఏబీసీ, సీ ఓటరు సర్వే ప్రకారం కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయంగా కనపడుతుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో ఈసారి ఎన్నికల్లో బీజేపీకి 68 నుంచి 80 కాంగ్రెస్‌కు 115 నుంచి 127 స్థానాలు దక్కనున్నట్లు పేర్కొంది. జనతాదళ్ ఎస్‌కు 23 నుంచి 35 స్థానాలు వస్తాయని సీ ఓటరు సర్వేలో తేలింది.
గ్రేటర్ బెంగళూరులో...
గ్రేటర్ బెంగళూరులో బీజేపీ పదకొండు నుంచి పదిహేను స్థానాలు వస్తాయని సర్వేలో తేలింది. కాంగ్రెస్ పార్టీ పదిహేను నుంచి 19 స్థానాలు దక్కించుకుంటుందని సర్వేలో వెల్లడయింది. జేడీ ఒక స్థానం నుంచి మూడు స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. ఇక పాత మైసూరు ప్రాంతంలో బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఇక్కడ బీజేపీకి ఒకటి నుంచి ఐదు స్థానాలు వస్తాయని సర్వేలో తేలింది.
పాత మైసూరు ప్రాంతంలోపాత మైసూరు ప్రాంతంలో...
పాత మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి 24 నుంచి 28 స్థానాలు దక్కించుకునే వీలుందని సర్వేలో తేలింది. జనతాదళ్ ఎస్ కు ఇక్కడ ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు స్థానాలు రావచ్చని తెలిపింది. ముంబయి కర్ణాటక ప్రాంతంలో బీజేపీ ఇరవై ఒక్క సీట్ల నుంచి 25 సీట్లు దక్కించుకునే అవకాశముందని పేర్కొంది. కాంగ్రెస్ కు 25 నుంచి 29 స్థానాలు రావచ్చని తెలిపింది. జేడీఎస్‌కు ఇక్కడ ఒక్కస్థానమే లభించనుందని తెలిపింది. కోస్టల్ కర్టాటకలో కొంత బీజేపీదే పైచేయిగా ఉంది. ఇక్కడ 9 నుంచి 13 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంటుందని, కాంగ్రెస్ మాత్రం 9 నుంచి 13 స్థానాల వరకే విజయం సాధించే అవకాశాలున్నాయని తేల్చింది. జేడీఎస్ ఒక్క స్థానానికే పరిమితమవుతుందని పేర్కొంది.
హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో...
హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలోనూ కాంగ్రెస్ దే పైచేయిగా సర్వేలో నిలిచింది. బీజేపీ ఎనిమిది నుంచి పన్నెండు సీట్లకు ఇక్కడ పరిమితమవుతుండగా, కాంగ్రెస్ మాత్రం 19 నుంచి 23 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని తేల్చింది. జేడీఎస్ కు ఇక్కడ ఒక్క స్థానమే దక్కుతుందన్న అంచనా వేసింది. సెంట్రల్ కర్ణాటకలోనూ కాంగ్రెస్ 18 నుంచి 22 స్థానాల్లో విజయం సాధిస్తుందని, బీజేపీకి మాత్రం పన్నెండు నుంచి పదహారు స్థానాలు వచ్చే అవకాశముందని, జేడీఎస్ ఒకటి లేదా రెండు స్థానాలు వచ్చే అవకాశముందని తేల్చింది. మొత్తం మీద ఈ సర్వేలో కాంగ్రెస్ కు కర్ణాటకలో కాంగ్రెస్‌కు విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఏబీసీ సర్వేలో పేర్కొంది. అయితే హంగ్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని పేర్కొంది.
Next Story