Sat Jan 04 2025 02:33:30 GMT+0000 (Coordinated Universal Time)
కౌన్ బనేగా క్రోర్ పతిలో రూ.కోటి గెలుచుకున్న గృహిణి.. రూ.7.5 కోట్లకు..
ఈ షోలో పాల్గొనేందుకు తను ఎలా సిద్ధమయ్యారో కూడా వివరించారు. ఇందులో పాల్గొనేందుకు తాను ప్రత్యేకంగా ఓ పుస్తకం కానీ..
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా జరుగుతున్న రియాలిటీ షో కౌన్ బనేగా క్రోర్ పతి. సామాన్యులను తమ మెమరీపవర్ తో కోటీశ్వరులను చేసే ప్రోగ్రాం ఇది. ఈ రియాలిటీ షో 13 సీజన్లను విజయవంతంగా కంప్లీట్ చేసుకుని 14వ సీజన్లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్ లో తొలిసారి కోటిరూపాయలు గెలుచుకుని సంచలనం సృష్టించిందో గృహిణి. 12వ తరగతి వరకే చదువుకున్న ఆమె.. ఈ సీజన్లో కోటిరూపాయలు గెలుచుకున్న తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన కవితా చావ్లా(45) 'కౌన్‌బనేగా క్రోర్‌పతి-14'లో కోటిరూపాయలు గెలిచి.. ఇప్పుడు రూ.7.5 కోట్లు గెలుచుకునేందుకు సమాయత్తమవుతున్నారామె. ఈ సందర్భంగా ఆమె తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. క్రోర్‌పతి షోలో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి కొల్హాపూర్ మహిళను కావాలని అనుకున్నానని, తన కల నిజమైందని సంతోషం వ్యక్తం చేశారు. 'ఓ రికార్డు సాధించా' అని సంబరపడ్డారు. కోటిరూపాయలు గెలుచుకోవడం కేక్ పై ఉన్న చెర్రీ లాంటిదన్నారు.
ఈ షోలో పాల్గొనేందుకు తను ఎలా సిద్ధమయ్యారో కూడా వివరించారు. ఇందులో పాల్గొనేందుకు తాను ప్రత్యేకంగా ఓ పుస్తకం కానీ, టీవీ చానళ్లు కానీ చూడలేదన్నారు. తన కుమారుడికి తాను ఏది బోధించినా ఆ పుస్తకాలనే తాను కూడా చదువుకునే దానినని, ముఖ్యమైన విషయాలను అండర్లైన్ చేసుకునే దానినని గుర్తు చేసుకున్నారు. తాను కేబీసీ షోను ఫాలో అయ్యేదానినని, కాబట్టి ఎటువంటి ప్రశ్నలు అడుగుతారో తనకు తెలుసని అన్నారు. కేబీసీ షోలో గెలుచుకున్న సొమ్ముతో ఏం చేస్తారని మీడియా ప్రశ్నించగా.. ఆ డబ్బును తన కుమారుడి చదువు కోసం ఉపయోగిస్తానని, దానికే తన తొలి ప్రాధాన్యమని అన్నారు. పై చదువుల కోసం అతడిని విదేశాలకు పంపుతానన్నారు.
Next Story