Fri Dec 27 2024 05:57:36 GMT+0000 (Coordinated Universal Time)
నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిరంతరం వైద్య బృందం పర్యవేక్షిస్తుంది. కేసీఆర్ ప్రస్తుతం గజ్వేల్ లోని ఫాం హౌస్ లో హోం ఐసొలేషన్ లో ఉన్నారు. ఫాం [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిరంతరం వైద్య బృందం పర్యవేక్షిస్తుంది. కేసీఆర్ ప్రస్తుతం గజ్వేల్ లోని ఫాం హౌస్ లో హోం ఐసొలేషన్ లో ఉన్నారు. ఫాం [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిరంతరం వైద్య బృందం పర్యవేక్షిస్తుంది. కేసీఆర్ ప్రస్తుతం గజ్వేల్ లోని ఫాం హౌస్ లో హోం ఐసొలేషన్ లో ఉన్నారు. ఫాం హౌస్ లో నలుగురు డాక్టర్ల బృందం నిరంతరం పర్యవేక్షిస్తుంది. కేసీఆర్ కు స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆసుపత్రిలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే చాలునని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు చెబుతున్నారు. ఫాం హౌస్ లోనే వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థతి నిలకడగానే ఉందన్నారు. కేసీఆర్ కు అవసరమైతే వైద్య సాయం అందించేందుకు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Next Story