చెంప చెళ్లుమనిపించారు
గత ఆరేళ్లుగా టీఆర్ఎస్ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల వలనే ఈ విజయం సాధ్యమయిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. విపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని [more]
గత ఆరేళ్లుగా టీఆర్ఎస్ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల వలనే ఈ విజయం సాధ్యమయిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. విపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని [more]
గత ఆరేళ్లుగా టీఆర్ఎస్ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల వలనే ఈ విజయం సాధ్యమయిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. విపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రజలే తీర్పు చెప్పారన్నారు. మరింత ముందుకు వెళ్లాలని ప్రజలు తమను దీవించారని కేసీఆర్ తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ ప్రజలు ఒకే రకమైన తీర్పు చెప్పారన్నారు. తమ పార్టీ పద్థతి ప్రజలకు నచ్చిందని చెప్పారు. బ్యాలట్ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లోనూ ప్రజలు తమ పక్షానే నిలిచారన్నారు. విపక్షాలకు నోరు పెగలడం లేదన్నారు. ఈ తీర్పు వారి చెంప చెళ్లుమనిపించేలా ఉందన్నారు. జాతీయ పార్టీలకు ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టారని కేసీఆర్ అన్నారు. సంక్షేమ పథకాలే తమను గెలిపించాయన్నారు. అధికార దుర్వినియోగం చేశారని విపక్షాలు ఆరోపిస్తు న్నాయని, తాను ప్రచారానికి కూడా పోలేదని కేసీఆర్ తెలిపారు. తాను అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే అధికారులతో మాట్లాడలేదని కేసీఆర్ వివరించారు.
ఇలాంటి ఫలితాలు అసాధ్యం…..
మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు రావడం అసాధ్యమన్నారు. 1984లో ఎన్టీఆర్ మద్యనిషేధం విధించిన తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీని ఆ ఎన్నికల్లో ప్రజలు గెలిపించలేదన్నారు. మద్యనిషేధం కారణంగా ఆదాయం తగ్గడంతో పన్నులు పెంచామని, అది ప్రజలకు రుచించలేదన్నారు. పట్టణ ప్రాంతాల్లో విభిన్నమైన ఓటర్లుంటారని, అక్కడ గెలుపు అంత సాధ్యం కాదన్నారు. ఎన్నికలను ఆపాలని కూడా విపక్షాలు విశ్వ ప్రయత్నం చేశాయన్నారు. ఇప్పుడు గెలిచిన ఛైర్మన్లు, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లకు ప్రభుత్వం వైపు నుంచి శిక్షణను నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ విజయానికి కృషి చేసిన కేటీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.