సీఏఏపై సీఎంలతో సమావేశం
ఆర్టికల్ 370కి మద్దతిచ్చామని, సీఏఏకు వ్యతిరేకంగా త్వరలోనే శాసనసభలో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తర్వాత అన్ని రాష్ట్రాల సీఎంలతో హైదరాబాద్ లో సీఏఏపైన సమావేశం [more]
ఆర్టికల్ 370కి మద్దతిచ్చామని, సీఏఏకు వ్యతిరేకంగా త్వరలోనే శాసనసభలో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తర్వాత అన్ని రాష్ట్రాల సీఎంలతో హైదరాబాద్ లో సీఏఏపైన సమావేశం [more]
ఆర్టికల్ 370కి మద్దతిచ్చామని, సీఏఏకు వ్యతిరేకంగా త్వరలోనే శాసనసభలో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తర్వాత అన్ని రాష్ట్రాల సీఎంలతో హైదరాబాద్ లో సీఏఏపైన సమావేశం నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. సీఏఏపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని చెప్పారు. సీఏఏ వంద శాతం తప్పుడు బిల్లు అని కేసీఆర్ అన్నారు. ఈ విషయంలో అమిత్ షా తనకు ఫోన్ చేస్తే మద్దతిచ్చేది లేదని చెప్పినట్లు కేసీఆర్ వివరించారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం జరగాలని కేసీఆర్ కోరారు. భారతదేశం ప్రజల దేశంలా ఉండాలని, మతదేశంగా ఉండకూడదన్నారు. అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు సీఏఏకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పారు.