ప్రభుత్వం చెప్పినట్లే పంటలు వేయాలి..లేకుంటే?
తెలంగాణలో వ్యవసాయానికి అనుకూలమైన నేలలు ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. నియంత్రిత విధానంలో పంటలు పండించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు కొత్త విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం [more]
తెలంగాణలో వ్యవసాయానికి అనుకూలమైన నేలలు ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. నియంత్రిత విధానంలో పంటలు పండించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు కొత్త విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం [more]
తెలంగాణలో వ్యవసాయానికి అనుకూలమైన నేలలు ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. నియంత్రిత విధానంలో పంటలు పండించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు కొత్త విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చెప్పిన పంటలనే రైతులు వేయాలని కోరారు. తెలంగాణ కాటన్ కు పేరుందన్నారు. దేశంలోనే తెలంగాణ, విదర్భలోనే నాణ్యత కలిగిన పత్తి అని కేసీఆర్ చెప్పారు. 70 లక్షల ఎకరాల్లో పత్తి పంటను ఈ ఏడాది పండించాల్సి ఉంటుందన్నారు. 40 లక్షల ఎకరాల్లో వరి వేయాలన్నారు. ప్రభుత్వం చెప్పిన రకాలునే వేయాలన్నారు. మొక్క జొన్న పంటకు బదులు పదిహేను లక్షల ఎకరాల్లో కందులు వేయాలని కోరారు. కందివేసే రైతులకు తాను హామీ ఇస్తున్నానని, పంట మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. పసుపు, ఎండుమిర్చి, సోయాబీన్స్ తో పాటు పండ్లతోటలు యధాతధంగా ఉంటాయన్నారు. వరి పంటను ప్రభుత్వం చెప్పినట్లు వేయకుంటే రైతు బంధు పథకం వర్తించదన్నారు.