కఠినంగా ఉండాలనే
తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 36 రోజులు నుంచి నడుస్తోంది. అయినా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఏమాత్రం దిగిరావడం లేదు. కార్మికులవి అన్యాయమైన డిమాండ్లు అనే ధోరణిలోనే [more]
తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 36 రోజులు నుంచి నడుస్తోంది. అయినా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఏమాత్రం దిగిరావడం లేదు. కార్మికులవి అన్యాయమైన డిమాండ్లు అనే ధోరణిలోనే [more]
తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 36 రోజులు నుంచి నడుస్తోంది. అయినా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఏమాత్రం దిగిరావడం లేదు. కార్మికులవి అన్యాయమైన డిమాండ్లు అనే ధోరణిలోనే కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. నిత్యం ఆర్టీసీ అధికారులతో గంటలు కొద్దీ సమీక్షలు చేస్తున్న కేసీఆర్ కార్మిక సంఘాలతో చర్చలకు మాత్రం నో అంటున్నారు. ఇటు హైకోర్టు కూడా ప్రభుత్వ తీరును ఎండగడుతోంది. అయినా సరే కేసీఆర్ మాత్రం ఆర్టీసీ సమ్మె విషయంలో తాను అనుకున్నదే చేయాలనుకుంటున్నారు. హైకోర్టులో తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు.
డెడ్ లైన్ విధించినా…..
ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడానికి డెడ్ లైన్ విధించినా కార్మికులు ఎవరూ పెద్దగా చేరలేదు. దాదాపు 48వేల మంది కార్మికులలో కేవలం 300 మంది పైచిలుకు మాత్రమే విధుల్లో చేరారు. ఇది కేసీఆర్ కు మరింత ఆగ్రహం తెప్పించిందంటున్నారు. చలో ట్యాంక్ బండ్ విజయవంతం కావడం పట్ల కూడా ఆయన పోలీసు అధికారులపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. తనను బేఖాతరు చేస్తూ దసరా పండగ సమయంలో సమ్మెలోకి వెళ్లిన కార్మికుల పట్ల కఠినంగా ఉండాలనే కేసీఆర్ భావిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి దీనికి ఫుల్ స్టాప్ పడాలని, ఇదే సరైన సమయని ఆయన అధికారులతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మొత్తం మీద తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు ఇప్పట్లో తెరపడేలా కన్పించడం లేదు.