Wed Jan 01 2025 15:31:05 GMT+0000 (Coordinated Universal Time)
కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను..
తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. టీఆర్ఎస్ నేతలు, వివిధ రంగాల ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రమాణస్వీకారోత్సవాహానికి హాజరయ్యారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ మహ్మద్ మహమూద్ అలీ కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మహమూద్ అలీకి మైనారిటీ కోటాలో మంత్రిగా కేసీఆర్ మరోసారి అవకాశం కల్పించారు. ఆయన ఈసారి కూడా డిప్యూటీ సీఎంగా పనిచేసే అవకాశం ఉంది. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా హాజరయ్యారు.
Next Story