Mon Jan 13 2025 20:15:51 GMT+0000 (Coordinated Universal Time)
ఓడితే రెస్ట్ తీసుకుంటా లేదా వ్యవసాయం చేసుకుంటా..!
టీఆర్ఎస్ ఓడిపోతే తనకేమీ నష్టం లేదని, రెస్ట్ తీసుకుంటానని లేదా వ్యవసాయం చేసుకుంటానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఖానాపూర్ లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ... టీఆర్ఎస్ గెలిస్తే మరింత కష్టపడి పనిచేస్తామని... ఓడిపోతే రెస్ట్ తీసుకుంటానని పేర్కొన్నారు. కానీ, మహాకూటమి గెలిస్తే చంద్రబాబు చేతికి పెత్తనం వెళుతుందని, అది తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు నష్టం చేస్తుందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్రానికి 35 లేఖలు రాసిన చంద్రబాబు చేతికి పెత్తనం పోవద్దన్నారు. తాను ఇప్పటికే చంద్రబాబును ఒకసారి తరిమికొట్టానని, ఇప్పుడు ప్రజలే తరిమికొట్టాలని పేర్కొన్నారు. చంద్రబాబును భుజాలపై మోసుకువస్తున్న కాంగ్రెస్ కి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు.
Next Story