Fri Apr 25 2025 07:55:45 GMT+0000 (Coordinated Universal Time)
మమతా బెనర్జీతో కేసీఆర్ కీలక చర్చలు

దేశంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటే తన లక్ష్యమని, ఈ దిశగా తన ప్రయత్నాలు కొనసాగుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన కలకత్తాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కూటమి ఏర్పాటు ఒక్కరోజులో జరిగేది కాదని, చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే సానుకూల ప్రకటన చెబుతామని ఆయన పేర్కొన్నారు. మరికొందరు నేతలతో చర్చిస్తానని పేర్కొన్నారు. మమతా బెనర్జీతో ఫెడరల్ ఫ్రంట్ తో పాటు జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు తెలిపారు. అంతకముందు పశ్చిమ బెంగాల్ సచివాలయంలో మమతా బెనర్జీ స్వయంగా కేసీఆర్ కి ఆహ్వానం పలికారు.
Next Story