బాలయ్యా....ఇదిగో వార్నింగ్ ..!!
నందమూరి బాలకృష్ణ తొడగొట్టి మీసం మెలేసి మరీ డైలాగ్ కొట్టడంలో తనకు తానే సాటి. బాలయ్య ఫ్యాన్స్ కి ఆయన చేసే ఈ ఫీట్ హుషారు తెప్పిస్తుంది. తెలంగాణా ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఎన్టీఆర్ తనయుడిగా సినీ నటుడిగా ఆయనకున్న క్రేజ్ తో బాలయ్య బాబు సభలకు, రోడ్ షో లకు జనం ఎగబడ్డారు. వచ్చిన జనాన్ని చూసి బాలయ్య సంబరపడ్డారు. రొటీన్ గా సినిమాల్లో చేసే సీన్ నేరుగా చూపించారు బాలకృష్ణ. ఎన్టీఆర్ బయోపిక్ కోసం మీసం తీసినా మూతిని మెలితిప్పి తొడగొట్టి గులాబీ పార్టీకి వార్నింగ్ ఇచ్చేశారు బాలకృష్ణ.
సీన్ రివర్స్ అయిందిగా ...
తెలంగాణ ఎన్నికల సభల్లో మీసం మెలేసి తొడగొట్టి ఊరుకోలేదు బాలకృష్ణ . చంద్రబాబు లేకుండా హైదరాబాద్ ఎక్కడిదని ప్రశ్నించారు. భాగ్యనగరం అభివృద్ధి సర్వం చంద్రబాబేనని అన్నారు. అక్కడితో కూడా ఆయన ఆగలేదు. ఎపి పాలిటిక్స్ లో జోక్యం చేసుకుంటామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ప్రతి సవాల్ విసిరారు. దమ్ముంటే ఏపీలో అడుగు పెట్టండి చూస్తాం అంటూ బెదిరిస్తూ హెచ్చరించారు.
సోషల్ మీడియాలో.....
ఆ డైలాగ్ లే ఇప్పుడు ఆయన కొంపముంచాయి. సోషల్ మీడియా అంతా బాలయ్య పాత డైలాగ్స్ రిపీట్ చేస్తున్నారు ఆయన ప్రత్యర్ధులు. కేసీఆర్ అయితే ఫలితాల తరువాత ప్రత్యర్థులకు ఇచ్చిన కౌంటర్ లో ఎపి పొలిటికల్ ఎంట్రీని తేల్చి చెప్పారు. బాబు సంగతులన్నీ ఎపి లో చెబుతానని ఆయనకు రిటర్న్ గిఫ్ట్ తధ్యమని హెచ్చరించారు. బాలయ్య నోటి దురుసు ఎంత పని చేసింది అని ఇప్పుడు తమ్ముళ్లు వాపోతున్నారు
- Tags
- bharathiya janatha party
- chief minister
- indian national congress
- k chandrasekhar rao
- left parties
- nandamuri balakrishna
- telangana
- telangana jana samithi
- telugudesam party
- ts politics
- కె. చంద్రశేఖర్ రావు
- కోదండరామ్
- టీ.ఎస్. పాలిటిక్స్
- తెలంగాణ
- తెలంగాణ జన సమతి
- తెలంగాణ రాష్ట్ర సమితి
- తెలుగుదేశం పార్టీ
- నందమూరి బాలకృష్ణ
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- ముఖ్యమంత్రి
- వామపక్ష పార్టీలు