కేరళపై అసభ్య పోస్ట్... ఉద్యోగం ఊస్ట్
భారీ వరదలతో కేరళవాసులు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణానాతీతం. కేరళవాసులకు దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అన్నివర్గాల వారు మద్దతుగా ఉంటున్నారు. చేతనైన సాయం చేస్తున్నారు. కేరళవాసుల కష్టాలు తీరాలని ప్రార్థిస్తున్నారు. ఈ సమయంలో ఓమన్ లో ఓ భారతీయుడు చేసిన పోస్ట్ వివాదాస్పదమైంది. దీంతో అతగాడు పనిచేసే సంస్థ ఉద్యోగం నుంచి తీసేసి బుద్ధి చెప్పింది. కేరళకు చెందిన రాహుల్ అనే వ్యక్తి ఓమన్ లో లులూ గ్రూప్ సంస్థలో పనిచేస్తున్నాడు.
కండోమ్ లూ అవసరమేనని...
కేరళ వరదల నేపథ్యంలో అక్కడి ప్రజలకు సాయం అందించాలని పేర్కొంటూ... సానిటరీ నాప్కిన్లు, ఇతర వస్తువుల లిస్టును ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు. దీనికి స్పందించిన రాహుల్...‘కండోమ్ లు కూడా అవసరమే’ అని రిప్లై చేశాడు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం రాహుల్ పనిచేసే సంస్థకు కూడా తెలిసింది. దీంతో అతడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే... ‘‘ఆ సమయంలో మధ్యం సేవించాను. ఏమి పోస్ట్ చేశానో తెలియదు. నన్ను క్షమించండి’’ అంటూ మళ్లీ ఓ వీడియోను రాహుల్ పోస్ట్ చేసినా నెటిజన్లు కానీ, అతడి సంస్థ గానీ క్షమించలేదు. దీంతో ఫూటుగా తాగి స్వంత రాష్ట్రంపైనే నోరు జారి రోడ్డుపై పడ్డాడు.