Tue Dec 24 2024 16:45:06 GMT+0000 (Coordinated Universal Time)
లాక్ డౌన్ సమయంలోనే సింహాలు మాయం
దుర్గగుడి రధంలో మూడు సింహాల చోరీల విషయంలో కీలక విషయాలు బయటకి వస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలోనే వెండి సింహాలు మాయమయినట్లు గుర్తించారు. మార్చి 11 వ [more]
దుర్గగుడి రధంలో మూడు సింహాల చోరీల విషయంలో కీలక విషయాలు బయటకి వస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలోనే వెండి సింహాలు మాయమయినట్లు గుర్తించారు. మార్చి 11 వ [more]
దుర్గగుడి రధంలో మూడు సింహాల చోరీల విషయంలో కీలక విషయాలు బయటకి వస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలోనే వెండి సింహాలు మాయమయినట్లు గుర్తించారు. మార్చి 11 వ తేదీన దుర్గగుడి ఈవో ఒక సర్క్యులర్ జారీచేశారు. ఉగాది సందర్భంగా వెండిరధాన్ని సిద్ధం చేయాలని ఆ సర్క్యూలర్ లో పేర్కొన్నారు. మార్చి 25వ తేదీన అమ్మవారిని వెండిరధంలో ఊరేగించాలని ఈవో ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఆ కార్యక్రమం జరగలేదు. దీంతో రధం విషయాన్ని అధికారులు మర్చిపోయారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ సమయంలోనే ఈ సింహాలు మాయమయినట్లు ప్రాధమికంగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు.
Next Story