కీలక తీర్పులు నేడే
సమత హత్యతో పాటు, హాజీపూర్ వరుస హత్య కేసుల పై ఇవాళ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీర్పులు వెలువరించే బోతున్నాయి. ఇందుకు సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. [more]
సమత హత్యతో పాటు, హాజీపూర్ వరుస హత్య కేసుల పై ఇవాళ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీర్పులు వెలువరించే బోతున్నాయి. ఇందుకు సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. [more]
సమత హత్యతో పాటు, హాజీపూర్ వరుస హత్య కేసుల పై ఇవాళ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీర్పులు వెలువరించే బోతున్నాయి. ఇందుకు సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హాజీపూర్ లో ముగ్గురు అమ్మాయిలను అత్యాచారం చేసి హత్య చేసి అతి కిరాతకంగా వ్యవహరించిన కేసులో తుది తీర్పును నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇవ్వబోతుంది. కేసులకు సంబంధించి ఇవాళ నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో తీర్పు రాబోతుంది . ఇప్పటికే విచారణ పూర్తయింది . మరోవైపు ఆసిఫాబాద్ కేసులో కూడా ఇవాళ తీర్పు వెలువరించిన పోతున్నట్లుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు వెల్లడించింది. సమత ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో ఇప్పటికే వాదప్రతివాదనలు పూర్తయ్యాయి. ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ వాదించింది. రెండు కేసుల్లో ఒకే రోజు తీర్పు రాబోతున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.
సైకో కిల్లర్ కేసులోనూ…
హజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి కేసులో నేడు తుది తీర్పు కోర్టు ప్రకటించబడుతుంది. నల్గొండ లోని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ జడ్జిమెంట్ ఇవ్వబోతుంది. ముగ్గురు మైనర్ అమ్మాయిలను హత్యాచారం చేసి హత్య చేసి బావిలో మృతదేహాలను శ్రీనివాస్ రెడ్డి పూడ్చి పెట్టాడు. ముగ్గురు మైనర్ బాలికల అత్యాచారం హత్య కు సంబంధించి ఇప్పటికే భువనగిరి పోలీసులు కేసు విచారణ చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. శ్రీనివాస్ రెడ్డి పై మూడు చార్జ్ షీట్లు భువనగిరి పోలీసులు ధాఖలు చేశారు. 300 మంది సాక్షులను పోలీసులు విచారించారు. 101 మంది సాక్ష్యాలు వాగ్మూలం కోర్టు నమోదు చేస్తుంది. మూడు నెలల పాటు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఈ నెల 17 న వాదనలు పూర్తి పూర్తి చేశారు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి చేసిన నేరాలకు సంబంధించిన అన్ని సాక్ష్యాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో ఫోరెన్సిక్ రీపోర్ట్ కీలకంగా మారనుంది.