Wed Jan 15 2025 00:18:26 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ మేనిఫెస్టోలో కీలకాంశాలు...
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేసింది. ఉద్యమ ఆకాంక్షలకు పెద్దపీట వేస్తూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పీపుల్స్ మేనిఫెస్టో రూపొందించింది. ఎల్లుండి మేడ్చెల్ లో జరుగనున్న బహిరంగ సభలో సోనియా గాంధీ చేతుల మీదుగా మేనిఫెస్టోను విడుదల చేయించనున్నారు.
- రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ
- రేషన్ షాపుల్లో రూపాయికి కిలో సన్నబియ్యం
- ప్రతి సంవత్సరం రెండు వాయిదాల్లో ఫీజు రీయింబర్స్ మెంట్
- అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు
- ఏడాదిలోపే ప్రభుత్వ శాఖల్లోని లక్ష ఉద్యోగాల భర్తీ
- 20 వేల పోస్టులతో మెగా డీఎస్సీ
- అన్ని జబ్బులకు ఆరోగ్యశ్రీ వర్తింపు, రూ.5 లక్షలకు చికిత్స పరిమితి పెంపు
- నిరుద్యోగ యువతకు రూ.3 వేల నిరుద్యోగ భృతి
Next Story