Sat Nov 23 2024 05:14:58 GMT+0000 (Coordinated Universal Time)
Congress : అభయ హస్తం .. అందరికీ .. మ్యానిఫేస్టో చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
తెలంగాణ మ్యానిఫేస్టోలో కీలక అంశాలను ప్రస్తావించింది. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా మ్యానిఫేస్టోకు రూపకల్పన చేశారు.
తెలంగాణ మ్యానిఫేస్టోలో కీలక అంశాలను ప్రస్తావించింది. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా మ్యానిఫేస్టోకు రూపకల్పన చేశారు. ప్రధానంగా రైతులు, యువత, నిరుద్యోగులు, మహిళలే లక్ష్యంగా మ్యానిఫేస్టోను రూపొందిచారు. జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని ప్రకటించింది. రైతులకు రెండు లక్షల రుణమాఫీ ప్రకటించింది. మూడు లక్షల వరకూ వడ్డీలేని రుణాలను అందిస్తామని తెలిపింది. అన్ని పంటలకు సమగ్ర భీమా ఇస్తామని కాంగ్రెస్ మ్యానిఫేస్టోలో పేర్కొంది. వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందిస్తామని పేర్కొంది.
జాబ్ క్యాలెండర్...
ఆరు నెలల్ల ఉపాధ్యాయ పోస్టులు మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని తెలిపింది. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు జాబ్ కాలెండర్ రిలీజ్ చేసింది. అన్ని పోటీ పరీక్షలకు ఫీజు రద్దు చేస్తామని చెప్పింది. విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని తెలిపింది. మూతబడిన ఆరు వేల పాఠశాలలను తిరిగి తెరుస్తామని మ్యానిఫేస్టోలో పేర్కొంది. దివ్యాంగులకు నెలకు ఆరువేల పింఛను ఇస్తామని తెలిపింది. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపింది.
రోజూ ప్రజాదర్బార్...
ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజాదర్బార్ ఉంటుందనితెలిపింది. తొలివిడత, మలి విడత తెలంగాణ ఉద్యమ కారుల కుటుంబాలకు ఇరవై ఐదు వేల పింఛన్లు అందచేస్తామని తెలిపింది. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడతామని తెలిపింది. బడ్జెట్ లో విద్యారంగానికి పదిహేను శాతం నిధులను కేటాయించింది. రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు పెట్టుబడి సాయం అందచేస్తామని మ్యానిఫేస్టోలో తెలిపారు. మొత్తం 62 అంశాలతో మ్యానిఫేస్టోను విడుదల చేశారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు లక్ష నగదు.. తులం బంగారం ఇస్తామని తెలిపింది.
Next Story