Wed Jan 15 2025 16:45:21 GMT+0000 (Coordinated Universal Time)
బండ్ల గణేష్ కు కీలక పదవి
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ను పీసీసీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేస్ షాద్ నగర్ లేదా రాజేంద్రనగర్ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించారు. కానీ షాద్ నగర్ లో ప్రతాప్ రెడ్డికి టిక్కెట్ కేటాయించిన కాంగ్రెస్, రాజేంద్రనగర్ పొత్తులో భాగంగా టీడీపీకి వదిలేసింది. దీంతో బండ్ల గణేష్ సేవలు పార్టీకి ఉపయోగించుకోవాలని ఆయనను అధికార ప్రతినిధిగా నియమించారు.
Next Story