Wed Dec 18 2024 16:00:29 GMT+0000 (Coordinated Universal Time)
సంచలన నిర్ణయం తీసుకున్న పొలార్డ్
పొలార్డ్ ప్రస్తుతం వెస్టిండీస్ కు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అన్ని విధాలుగా ఆలోచించి ఈ నిర్ణయం
విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ అయిన.. వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. పొలార్డ్ ప్రస్తుతం వెస్టిండీస్ కు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అన్ని విధాలుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పొలార్డ్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఎంతోమంది యువక్రికెటర్ల లాగే తాను కూడా వెస్టిండీస్ జట్టుకు ఆడాలని కలలు కన్నానని, 10 ఏళ్ల వయసు నుంచే తాను కరీబియన్ జట్టుకు ఆడడం కోసం కష్ట పడడం మొదలు పెట్టానని అన్నాడు. 15 ఏళ్ల పాటు వెస్టిండీస్ జట్టుకు వన్డేలు, టీ20 ఫార్మాట్లలో సేవలు అందించడం పట్ల గర్విస్తున్నానని పొలార్డ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టాడు.
34 ఏళ్ల పొలార్డ్ 2007లో దక్షిణాఫ్రికాపై అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 123 అంతర్జాతీయ వన్డేలు ఆడి 26.01 సగటుతో 2,706 పరుగులు చేశాడు. వాటిలో 3 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 101 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడి 25.30 సగటుతో 1,569 పరుగులు సాధించాడు. వాటిలో 6 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్న పొలార్డ్ లీగుల్లో ఆడతానని తెలిపాడు.
123 వన్డేలాడి 2706 పరుగులు చేశాడు పొలార్డ్. 101 టీ20ల్లో 1569 రన్స్ సాధించాడు. బ్యాటింగ్ ఆల్రౌండరైన పొలార్డ్ టెస్టు క్రికెట్ మాత్రం ఆడలేదు. 2014 డిసెంబరులో వన్డే జట్టు నుంచి ఉద్వాసనకు గురైన పొలార్డ్.. 2016లో పునరాగమనం చేశాడు. 2019లో జట్టు కెప్టెన్సీ స్వీకరించిన పొలార్డ్.. రెండు ఫార్మాట్లలో కలిపి 61 మ్యాచ్లకు సారథ్యం వహించాడు.
Next Story