Sat Jan 11 2025 22:43:09 GMT+0000 (Coordinated Universal Time)
రావెలను మంత్రిని చేస్తా
ఎమ్మల్యే పదవికి కూడా రాజీనామా చేసి జనసేనలో చేరిన రావెల కిశోర్ బాబు నిజమైన అంబేద్కర్ వాది అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శనివారం పవన్ కళ్యాణ్ సమక్షంలో కిశోర్ బాబు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... కిశోర్ బాబును 2019లో ఎమ్మెల్యేగా చేసి మంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కులాల ఐక్యత రావాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్ మాదిరిగా కుల రాజకీయాలు వస్తే రాష్ట్రానికి భవిష్యత్ ఉండదన్నారు. ఆంద్రప్రదేశ్ లో శాంతిభద్రతలను కాపాడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని, ఆయనకు ఎమ్మెల్యేల మీద కంట్రోల్ లేదని, వయస్సు అయిపోతోందని పేర్కొన్నారు.
Next Story