Mon Nov 18 2024 06:45:19 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ అసహనం.. కొడాలి మరోసారి విజయకేతనం ఎలాగంటే?
కొడాలి నాని కృష్ణా జిల్లాలోనే వైసీపీకి స్ట్రాంగ్ లీడర్. నాని ఖచ్చితంగా గెలుస్తారన్నది ప్రత్యర్థులు సయితం అంగీకరిస్తారు
కొడాలి నాని కృష్ణా జిల్లాలోనే వైసీపీికి స్ట్రాంగ్ లీడర్. ఎవరి గెలుపుపై పెద్దగా అంచనాలు లేకపోయినా నాని గెలుస్తారన్నది ప్రత్యర్థులు సయితం అంగీకరిస్తారు. గుడివాడను తన కంచుకోటగా కొడాలి నాని మార్చుకున్నారు. ఏపార్టీలో ఉన్న గెలిచేది నానియే అన్నది వాస్తవం. వరసగా గెలుస్తూ గుడివాడలో కొడాలి నాని తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. జగన్ పార్టీలో ఆయన కీలక నేతగా మారిపోయారు.
రాధా పోటీ చేస్తారని...
అయితే కొంతకాలం క్రితం టీడీపీ నేత వంగవీటి రాధా గుడివాడలో తరచూ పర్యటించేవారు. కాపు సామాజికవర్గం నేతలతో పాటు తన తండ్రి రంగా విగ్రహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాధా పాల్గొనేవారు. దీంతో వచ్చే ఎన్నికల్లో వంగవీటి రాధాను గుడివాడ నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కొడాలి నానిని కట్టడి చేసేందుకు రాధాను టీడీపీ అధినేత రంగంలోకి దించారన్న వార్తలు కూడా వచ్చాయి.
వంగవీటి అయితేనే?
గత ఎన్నికల్లో గుడివాడలో కొడాలి నానిపై పోటీ చేసిన దేవినేని అవినాష్ వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇక గుడివాడలో టీడీపీకి పోటీ చేసే అభ్యర్థులు కరువయ్యారు. చంద్రబాబు ఎన్ని ప్రయోగాలు చేసినా గుడివాడలో ఫలించలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని చంద్రబాబు, లోకేష్ ను టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కొడాలి నానిని ఓడించాలన్నది చంద్రబాబు లక్ష్యంగా కన్పిస్తుంది. అందుకే వంగవీటి రాధాను రంగంలోకి దించారని పార్టీలోనూ చర్చ జరుగుతోంది.
లోకేష్ అసహనం...
కానీ వంగవీటి రాధా మంత్రి కొడాలి నానితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటం టీడీపీ హైకమాండ్ కు మింగుడు పడటం లేదు. ప్రధానంగా లోకేష్ రాధా విషయంలో కొంత అసహనంతో ఉన్నారని తెలిసింది. కొడాలి నాని, వల్లభనేని వంశీలతో తిరిగే వంగవీటి రాధాను నమ్మడానికి లేదని లోకేష్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. రాధాను నమ్మి గుడివాడలో అభ్యర్థిగా ప్రకటించలేమని కూడా చెబుతున్నారు. కొడాలి నాని మాత్రం తనకు గుడివాడలో రాధా తనకు అడ్డురాకుండా చేసుకోగలిగారన్న టాక్ మాత్రం వినపడుతుంది.
- Tags
- kodali nani
- ysrcp
Next Story