Kodali nani : పవన్ కు కొడాలి స్ట్రాంగ్ వార్నింగ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నీ అల్టిమేటంలకు, డెడ్ లైన్ లకు ఎవరూ భయపడబోరని ఆయన అన్నారు. [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నీ అల్టిమేటంలకు, డెడ్ లైన్ లకు ఎవరూ భయపడబోరని ఆయన అన్నారు. [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నీ అల్టిమేటంలకు, డెడ్ లైన్ లకు ఎవరూ భయపడబోరని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆపాలంటే బీజేపీకి, ఢిల్లీలో మోదీకి వార్నింగ్ ఇవ్వాలని నాని కోరారు. మోదీ అపాయింట్ మెంట్ కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ రెండేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించకవపోవడంతో అఖిలపక్ష డ్రామాలు ఆడుతున్నారన్నారు.
భయపడేవారు ఎవరూ లేరు…
నీ డెడ్ లైన్ లకు భయపడి పోయేవారు ఎవరూ లేరని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి కొడాలి నాని వ్యాఖ్యానించారు. పవన్ చేతకాని దద్దమ్మలా వ్యవహరిస్తున్నారన్నారు. పొత్తుల కోసం తిరగడం తప్ప పవన్ కల్యాణ్ కు వేరే దారి కన్పించడం లేదన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ మూడు కలసి పోటీ చేసినా జగన్ ను ఏమీ చేయలేరన్నారు. నీ డెడ్ లైన్ ఇకపై పెట్టవద్దని, దానిని ఎవరూ ఇక్కడ కేర్ చేయరని కొడాలి నాని వార్నింగ్ ఇచ్చారు.