కమ్మ కులంపై కొడాలి నాని?
కమ్మకులానికి రాజధాని తరలించడం వల్ల ఇబ్బందేమీ లేదని మంత్రి కొడాలి నాని అన్నారు. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడులు కమ్మ కులాన్ని [more]
కమ్మకులానికి రాజధాని తరలించడం వల్ల ఇబ్బందేమీ లేదని మంత్రి కొడాలి నాని అన్నారు. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడులు కమ్మ కులాన్ని [more]
కమ్మకులానికి రాజధాని తరలించడం వల్ల ఇబ్బందేమీ లేదని మంత్రి కొడాలి నాని అన్నారు. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడులు కమ్మ కులాన్ని ఉద్ధరించడానికేనన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ రాష్ట్రంలోని కమ్మ సోదరులు ఎవరూ రాజధాని తరలింపు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. రాజధాని మద్రాస్ లో, కర్నూలు, హైదరాబాద్ లో ఉన్నప్పుడు బెజవాడ, గుంటూరు నగరాలు అభివృద్ధి చెందలేదా? అని ప్రశ్నించారు. విశాఖను తరలించినంత మాత్రాన బాగుపడేది ఎవరని కొడాలి నాని ప్రశ్నించారు. విశాఖలోనే కమ్మ వారే అధికంగా ఉన్నారన్నారు. విశాఖలో ఉన్న డాల్ఫిన్, నోవాటెల్ వాటితో పాటు హోటళ్ల యాజమాన్యం మొత్తం కమ్మవారిదేనన్నారు. ఇక అక్కడ సినిమా థియేటర్లన్నీ మా సామాజికవర్గానికి చెందిన వారివేనని కొడాలి నాని తెలిపారు. విశాఖలో ఎంవీవీఎస్ మూర్తి, పురంద్రీశ్వరి, కంభంపాటి హరిబాబు, మొన్న వైసీపీ నుంచి గెలిచిన సత్యనారాయణలు కమ్మకులానికి చెందిన వారు కాదా? అని ప్రశ్నించారు.
సొల్లు కబుర్లు కాదు….
రాజధాని తరలింపుతో నష్టపోయేది చంద్రబాబు, పత్రికాధిపతులేనని కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిని ఇక్కడి నుంచి పూర్తిగా తీసివేయడం లేదన్న విషయాన్ని గుర్తుంచు కోవాలన్నారు. అమరావతి ఒక మోసమని కొడాలి నాని అభివర్ణించారు. పది కోట్లు ఎకరం విలువ చేస్తుందంటే రాష్ట్రంలోని ప్రతి రైతు తన పొలాన్ని ఇచ్చి త్యాగాలు చేస్తారన్నారు. నిజంగా రాజధాని సెంటిమెంట్ బలంగా ఉందనకుంటే 21 మంది రాజీనామాలు చేయాలని కొడాలి నాని సవాల్ చేశారు. సొల్లు కబుర్లు చెప్పడం కాదన్నారు.