Mon Jan 13 2025 08:56:50 GMT+0000 (Coordinated Universal Time)
ఫామ్ హౌజ్ లో పడుకునే వ్యక్తికి ఓటేందుకు...?
గెలిచినా... ఓడినా ఫామ్ హౌజ్ తో పడుకునే వ్యక్తికి ఓటెందుకు వేయాలని టీజేఎస్ అధినేత ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. మేడ్చెల్ లో జరిగిన కాంగ్రెస్ సభలో ఆయన మాట్లాడుతూ... ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని తెలంగాణ పోరాటాన్ని గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. నాలుగున్నరేళ్లగా తెలంగాణలో ఎవరికీ మేలు జరగలేదన్నారు. రోజుల తరబడి నిద్ర లేకుండా చదువుతున్న యువతకు ఉద్యోగాలు దొరకలేదని, మద్దతు ధర అడిగిన రైతులకు బేడీలు వేశారని, నేరెళ్లలో ఇసుక మాఫియాను అడుకున్న వారిపై దాడులు చేశారన్నారు. సర్వశక్తులు ఒక్కటై నిరంకుశ కేసీఆర్ ను గద్దె దించడానికే ప్రజా కూటమిని ఏర్పాటు చేశామన్నారు. కేసీఆర్ విచ్చలవిడిగా ఎన్నికల్లో డబ్బులు వెదజల్లుతున్నారని...తాము వారిలా కొట్లు కొల్లగొట్టలేదని ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టలేమని పేర్కొన్నారు.
Next Story