Wed Dec 18 2024 13:13:27 GMT+0000 (Coordinated Universal Time)
ఇలాంటి చంద్రబాబును నమ్మేదెవరు?
చంద్రబాబు నాయుడు తొలి నుంచి రైతు వ్యతిరేకి అని వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. విద్యుత్ ధరలపై ఉద్యమిస్తున్న వారిపై కాల్పులు జరిగి నేటికి 21 [more]
చంద్రబాబు నాయుడు తొలి నుంచి రైతు వ్యతిరేకి అని వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. విద్యుత్ ధరలపై ఉద్యమిస్తున్న వారిపై కాల్పులు జరిగి నేటికి 21 [more]
చంద్రబాబు నాయుడు తొలి నుంచి రైతు వ్యతిరేకి అని వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. విద్యుత్ ధరలపై ఉద్యమిస్తున్న వారిపై కాల్పులు జరిగి నేటికి 21 ఏళ్లు పూర్తయ్యాయన్నారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హయాంలో బషీర్ బాగ్ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందిన విషయాన్ని పార్థసారధి గుర్తు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ అంటే చంద్రబాబు ఎద్దేవా చేసిన విషయాన్ని కూడా పార్థసారధి గుర్తు చేశారు. ఇంత ప్రజా వ్యతిరేక పనులు చేసిన చంద్రబాబు నేడు పెట్రోలు, డీజిల్ ధరలపై ఉద్యమించడం నీచరాజకీయం చేయడమేనని పార్థసారధి అన్నారు. చంద్రబాబు పెట్రోలు, డీజిల్ ధరలపై నాలుగు సార్లు పన్నులు పెంచారన్నారు.
Next Story