Wed Jan 15 2025 06:02:40 GMT+0000 (Coordinated Universal Time)
రెండేళ్లుగా పార్టీలో ఉంటూనే ప్రశ్నించాను
పార్టీపరమైన నిర్ణయాలు నచ్చకనే టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చానని, ఈ నెల 23న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. నిన్న టీఆర్ఎస్ కి రాజీనామా చేసిన ఆయన ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను టీఆర్ఎస్ నెరవేర్చలేకపోయిందన్నారు. తన నియోజకవర్గంలో అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, అధికార పార్టీ ఎంపీగా ఉండి కూడా సమస్యలు పరిష్కరించలేకపోయానన్నారు. నాలుగేళ్ల నుంచి కూడా పార్టీలో కొందరితో వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని, వ్యక్తిగత విభేదాలతో పార్టీ మారలేదని స్పష్టం చేశారు. రెండేళ్లుగా పార్టీ, ప్రభుత్వ విధానాలపై పార్టీలో ఉంటూనే ప్రశ్నిస్తున్నానని తెలిపారు.
Next Story