కొండా విశ్వేశ్వర్ రెడ్డి అరెస్ట్ తప్పదా …??
ఎన్నికల సమయంలో నమోదైన కేసులో సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అరెస్టు తప్పదని అంటున్నారు .. తన అరెస్టు నోటీస్ ను సవాల్ చేస్తూ కొండా [more]
ఎన్నికల సమయంలో నమోదైన కేసులో సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అరెస్టు తప్పదని అంటున్నారు .. తన అరెస్టు నోటీస్ ను సవాల్ చేస్తూ కొండా [more]
ఎన్నికల సమయంలో నమోదైన కేసులో సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అరెస్టు తప్పదని అంటున్నారు .. తన అరెస్టు నోటీస్ ను సవాల్ చేస్తూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వాదప్రతివాదనలు విన్న తర్వాత కొండా విశ్వేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సమయంలో తన అనుచరుడు సందీప్ రెడ్డి పెద్ద మొత్తంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బులు తీసుకెళ్తూ పట్టుబడ్డారు. సందీప్ రెడ్డి నీ అదుపులోకి తీసుకోగా, కొంతమంది నాయకులు డబ్బు పంపకాలు జరిపినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో పాటుగా సందీప్ రెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వెళ్లారు. నోటీసులు ఇవ్వడానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్ళిన పోలీసుల పైన దాడి చేసినట్టుగా పోలీసులు కేసు నమోదు చేశారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి 41 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసు జారీ చేశారు.. దీనిని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో కొండా అరెస్ట్ తప్పదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
- Tags
- high court
- indian national congress
- konda visweswarareddy
- police
- sandeep reddy
- telangana
- à°à±à°à°¡à°¾ విశà±à°µà±à°¶à±à°µà°°à± à°°à±à°¡à±à°¡à°¿
- à°¤à±à°²à°à°à°¾à°£
- à°ªà±à°²à±à°¸à±à°²à±
- à°à°¾à°°à°¤ à°à°¾à°¤à±à°¯ à°à°¾à°à°à±à°°à±à°¸à±
- à°¸à°à°¦à±à°ªà± à°°à±à°¡à±à°¡à°¿
- à°¹à±à°à±à°°à±à°à±