కోవిడ్ కంట్రోల రూం మళ్లీ ప్రారంభం
హైదరాబాద్ లో ప్రస్తుతం కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు చేపడుతున్న చర్యలు నగరవాసులకు కరోనా సంబంధిత అంశాలపై సమాచారం అందించేందుకు జిహెచ్ఎంసి లో కోవిడ్-19 కంట్రోల్ రూం ను [more]
హైదరాబాద్ లో ప్రస్తుతం కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు చేపడుతున్న చర్యలు నగరవాసులకు కరోనా సంబంధిత అంశాలపై సమాచారం అందించేందుకు జిహెచ్ఎంసి లో కోవిడ్-19 కంట్రోల్ రూం ను [more]
హైదరాబాద్ లో ప్రస్తుతం కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు చేపడుతున్న చర్యలు నగరవాసులకు కరోనా సంబంధిత అంశాలపై సమాచారం అందించేందుకు జిహెచ్ఎంసి లో కోవిడ్-19 కంట్రోల్ రూం ను ప్రారంభించాలని ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశించారు. 24/7 ఈ కంట్రోల్ రూం పనిచేసేవిధంగా, సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని అన్నారు. నగరంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రతిరోజు పెద్ద ఎత్తున బయో వ్యర్థాలు వస్తున్నాయని, వీటిని తగు నిబంధనల ప్రకారం తీసివేసేందుకు ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు చేపట్టిన చర్యలపై తనిఖీలు చేపట్టాలని జోనల్, డిప్యూటి కమిషనర్ లను ఆదేశించారు. నగర పౌరులు ఉపయోగించిన ఫేస్ మాస్కులు రోడ్లపై వదిలేస్తున్నారని, ఇవి కూడా బయోమెడికల్ వ్యర్థాల కిందకు వస్తాయని తెలిపారు. గత సంవత్సరంలో కరోనా మొదటి దశ నియంత్రణలో మిషన్ మోడ్ తో పనిచేసిన విధంగానే ప్రస్తుతం కూడా పనిచేయాలని సూచించారు. కోవిడ్-19 సంబంధిత అంశాలపై నగరవాసుల అవసరాలను తీర్చడం, తగు సలహాలు, సూచనలు ఇవ్వడానికి జిహెచ్ఎంసిలో ప్రత్యేక నోడల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.