Sun Dec 22 2024 11:35:52 GMT+0000 (Coordinated Universal Time)
సీమ ఎత్తిపోతల పథకం పై కేఆర్ఎంబీ?
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు డీపీఆర్ అంచనాలకు మించి జరుగుతున్నాయని కేఆర్ఎంబీ బృందం అభిప్రాయపడింది. ఈ నెల 11వ తేదీన ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన బృందం ఎన్జీటీకి [more]
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు డీపీఆర్ అంచనాలకు మించి జరుగుతున్నాయని కేఆర్ఎంబీ బృందం అభిప్రాయపడింది. ఈ నెల 11వ తేదీన ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన బృందం ఎన్జీటీకి [more]
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు డీపీఆర్ అంచనాలకు మించి జరుగుతున్నాయని కేఆర్ఎంబీ బృందం అభిప్రాయపడింది. ఈ నెల 11వ తేదీన ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన బృందం ఎన్జీటీకి సమగ్ర నివేదికను సమర్పించింది. తాము పర్యటించినప్పుడు అక్కడ పనులు జరగడం లేదని, అయితే డీపీఆర్ కు భిన్నంగా పనులు జరుగుతున్నట్లు తాము గమనించామని బృందం తన నివేదికలో పేర్కొంది. గతంలో ఈ అంశంపై విచారణ జరిగినప్పుడు ఎన్జీటీ తీవ్రస్థాయిలో స్పందించింది. నిబంధనలను అతిక్రమిస్తే చీఫ్ సెక్రటీరీ జైలు పాలు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేఆర్ఎంబీ బృందం ఇచ్చిన నివేదికపై ఎన్జీటీ ఎలా స్పందింస్తున్నది చూడాల్సి ఉంది.
Next Story