మంత్రి కేటీఆర్‌కు ట్వీట్.. క్షణాల్లో సాయం
ఒక వ్యక్తి ట్విట్ లో పాల కోసం పోస్ట్ చేసిన వెంటనే మంత్రి స్పందించి అర్ధరాత్రి ఒంటి గంటకు మంత్రి కేటీఆర్ పాలు పంపించారు.తల్లిలేని ఒక 5 [more]
ఒక వ్యక్తి ట్విట్ లో పాల కోసం పోస్ట్ చేసిన వెంటనే మంత్రి స్పందించి అర్ధరాత్రి ఒంటి గంటకు మంత్రి కేటీఆర్ పాలు పంపించారు.తల్లిలేని ఒక 5 [more]
ఒక వ్యక్తి ట్విట్ లో పాల కోసం పోస్ట్ చేసిన వెంటనే మంత్రి స్పందించి అర్ధరాత్రి ఒంటి గంటకు మంత్రి కేటీఆర్ పాలు పంపించారు.తల్లిలేని ఒక 5 నెలల పాపకు పాలులేవంటూ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ఓ వ్యక్తి ట్వీట్ చేయడంతో మంత్రి వెంటనే స్పందించి డిప్యూటీ మేయర్ ద్వారా పాలు పాపకు అందేటట్లుగా సాయం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్‌నగర్‌లో నివాసం ఉంటున్న లకాన్సింగ్, జ్యోతిలు దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వారికి 5 నెలల పాప ఉంది. నెల రోజుల క్రితం అనారోగ్య కారణాలతో పాప తల్లి జ్యోతి మృతి చెందింది. దాంతో తండ్రి లకాన్సింగ్ పాపకు తానే ప్యాకెట్ పాలు పట్టిస్తూ ఉండేవాడు. కానీ లాక్డౌన్ కారణాల వల్ల ఆ పాపకు గురువారం తండ్రి పాల ప్యాకెట్ తీసుకు రాలేకపోయాడు. పాలులేక ఆ రాత్రంతా పాప ఏడుస్తుంటే ఏమి చేయాలో తోచక ఈ విషయాన్ని వారి ఇంటి పక్కనే ఉంటున్న నవీన్ అనే యువకుడికి విషయం చెప్పడంతో ఆ యువకుడు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. దానికి మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి సమీపంలో బోరబండ వద్ద నివసిస్తున్న డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్‌కు విషయం తెలియజేసి పాపకు పాలను చేరేలా చూడాలని కోరారు. కేటీఆర్ సూచన మేరకు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో డిప్యూటీ మేయర్ బాబా హుటాహుటిన ఎర్రగడ్డకు పాలు తీసుకుని వెళ్లి పాప తండ్రికి అందించడంతో పాటుగా ఆ కుటుంబానికి నెలకు సరిపడా నిత్యా వసర సరుకులు కూడా అందించారు.
.