అనుమానం ఉంటే పరిశీలించుకోండి.. కేటీఆర్ సవాల్
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖను విడుదల చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,32,899 ఉద్యోగాలు భర్తీ చేశామని కేటీఆర్ [more]
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖను విడుదల చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,32,899 ఉద్యోగాలు భర్తీ చేశామని కేటీఆర్ [more]
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖను విడుదల చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,32,899 ఉద్యోగాలు భర్తీ చేశామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. విపక్షాలు తమపై అసత్య ప్రచారాన్ని చేస్తున్నాయన్నారు. నిజాలను దాచేసే ప్రయత్నం చేయడం విచారకరమని కేటీఆర్ అన్నారు. ఎవరికైనా అనుమానం ఉంటే పరిశీలించుకోవచ్చని బహిరంగ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 30,594, తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నుంచ 31,972, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్ రిక్రూట్ మెంట్ బోర్డు నుంచి 3,623, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి 179 పోస్టులను భర్తీ చేశామని కేటీఆర్ తెలిపారు.