Thu Jan 16 2025 08:11:33 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీతోనూ పొత్తు పెట్టుకుంటారు
‘‘చంద్రబాబు జీవితంలో ఒంటరిగా పోటీ చేయలేదు. ఆయన స్వయం ప్రకాశం లేని చంద్రుడు. దేశంలో ఆయన పొత్తు పెట్టుకోని పార్టీ ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అవసరమైతే వైసీపీతోనే ఆయన పొత్తు పెట్టుకుంటారు.’’ అని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం మీట్ ది ప్రెస్ లో ఆయన మీట్లాడుతూ...‘‘జనసేన, బీజేపీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, తాజాగా కాంగ్రెస్ తో కూడా చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నారు. మిగిలిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అవసరమైతే చంద్రబాబు వైసీపీతో కూడా ఆయన పొత్తు పెట్టుకుంటారు. ఆయనకు తరాతమ బేధాలు ఏమీ లేవు. చంద్రబాబు మారుపేరే అవకాశవాదం. ఆయనతో నీతులు చెప్పిచ్చుకునే ఖర్మ మాకు లేదు. అటు చంద్రబాబు, ఇటు కేసీఆర్ పాలన బేరీజు వేసుకుని ప్రజలు ఓట్లు వేస్తారు.
Next Story