చంద్రబాబు గారి ఆణిముత్యాలు చూడండి..!
తెలంగాణలో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు నేపథ్యంలో చంద్రబాబు వైఖరిని టీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. ఈ మేరకు మంగళవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్ల స్ర్కీన్ షాట్ లు పెట్టి మరీ చంద్రబాబుపై ప్రశ్నలు కురిపించారు. 2014లో ‘రాహుల్ గాంధీ, సోనియా లకు తెలంగాణపై కొత్తగా ప్రేమ పుట్టింది. గతంలో వారు తెలంగాణకు ఏం చేశారు.?’ అని చంద్రబాబు ఓ ట్వీట్ చేశారు. ఇప్పుడు అదే ట్వీట్ ను కేటీఆర్ ట్వీట్ చేస్తూ... బాబు గారి మరో ఆణిముత్యం.. ఒకవేళ స్కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా 2014కి ముందు తెలంగాణలో ఏమి అభివృద్ధి చేయకపోతే ఇప్పుడు ఏం మారింది అని చంద్రబాబు ప్రశ్నించారు.
Another pearl of wisdom from CBN Garu👇
If Scamgress leaders Rahul & Sonia didn’t do squat for Telangana development till 2014, what changed since then? #MahaGhatiyaBandhan pic.twitter.com/jfX0anT1mi
— KTR (@KTRTRS) October 9, 2018
ఇటాలియన్ మాఫియా రాజ్ కి కొత్త స్నేహితులు
2014 ఎన్నికల సమయంలో మరో ట్వీట్ లో చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇటాలియన్ మాఫియా రాజ్ తో పోల్చారు. కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలన ఇక ఉండదని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను కూడా కేటీఆర్ ప్రస్తావించి... ఇటాలియన్ మాఫియా రాజ్ కి ఇప్పుడు కొత్త స్నేహితులు ఉన్నారు. ఎవరో చెప్పండి..? అందుకే ఈ పొత్తును మహా ఘటియా బంధన్ అంటున్నాను అని కేటీఆర్ చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ఇక కాంగ్రెస్ అవినీతి పాలన అంతమే మా లక్ష్యమని చంద్రబాబు చేసిన మరో ట్వీట్ ను కూడా జతచేసిన కేటీఆర్... అప్పటి ఫేమస్ మాటలు చూడండి అని ట్వీట్ చేశారు.
So the “Italian Mafia Raj” (as described below) has new friends now. Guess who it is ?
Now you know why I call it #MahaGhatiyaBandhan pic.twitter.com/RQQCOueTd7
— KTR (@KTRTRS) October 9, 2018
“Our aim is to make nation free of corrupt congress”.
Famous last words 😅👇#MahaGhatiyaBandhan pic.twitter.com/N6UQfSTePw
— KTR (@KTRTRS) October 9, 2018