Fri Dec 27 2024 18:47:51 GMT+0000 (Coordinated Universal Time)
పట్టాభిషేకానికి వేళాయే..!
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రసిడెంట్ గా కేటీఆర్ ఇవాళ బాధ్యతలు తీసుకోనున్నారు. ఇక నుంచి పార్టీ నిర్వహణ మొత్తం కేటీఆర్ చూసుకోనున్నారు. తెలంగాణ భవన్ లో మరికాసేపట్లో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున కార్యకర్తలు, టీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. నగరం మొత్తం టీఆర్ఎస్ హోర్డింగులు, జెండాలతో నిండిపోయింది. హైదరాబాద్ గులాబీవనాన్ని తలపిస్తోంది. బసవతారకం ఆసుపత్రి నుంచి తెలంగాణ భవన్ వరకు కేటీఆర్ ర్యాలీగా వెళ్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. బోనాలు, బతుకమ్మలతో ఆయనకు స్వాగతం పలికారు. అంతకుముందు ఎంపీ కవిత కేటీఆర్ కు వీరతిలకం దిద్ది పంపించారు.
Next Story