కేటీఆర్ వ్యాఖ్యలకు రీజన్ ఇదే ...?
తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టిన చంద్రబాబుకు సరైన గుణపాఠం చెబుతామని కెటిఆర్ హెచ్చరించారు. ఎపి పాలిటిక్స్ లో గులాబీ పార్టీ వేలు పెట్టక తప్పదని హాట్ కామెంట్స్ చేశారు కెటిఆర్ . అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఓటుకు నోటు కేసును తండ్రి కొడుకులు మరోసారి బయటకు తీసి ప్రచారంలో విస్తృతంగా వాడేస్తున్నారు. ఇప్పటివరకు కెటిఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయలేదు. ఏపీలో టీఆర్ఎస్ చంద్రబాబు కు వ్యతిరేకంగా పోటీ చేస్తుందా లేక బాబు ప్రత్యర్థులకు సాయం అందించి బాబును ఓడిస్తారా ?
బాబు పై రగిలిపోతున్న గులాబీ ...?
ఊహించని రీతిలో ఆ జన్మ శత్రువు లు గా వున్న కాంగ్రెస్ టిడిపి లు జత కలిశాయి.విజయం కేక్ వాక్ అనుకున్న టీఆర్ఎస్ కు ఇప్పుడు ముప్పేట దాడి చేస్తున్న మహాకూటమి దెబ్బకు కొంత డీలా పడింది. ఈ పరిస్థితి కి కారణమైన చంద్రబాబు అండ్ టీమ్ కు ఏపీలో చుక్కలు చూపించాలని గులాబీ పార్టీ డిసైడ్ అయిపొయింది. అందులో భాగంగానే కెటిఆర్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయంటున్నారు.
కేసీఆర్ అదే చేస్తారా?
అయితే గులాబీ పార్టీ జగన్, పవన్ లకు ఎవరికి మద్దతు ఇస్తుంది..? తెలంగాణ లోలాగానే ఏపీలో కూడా మహాకూటమికి గులాబీ పార్టీ నడుం కట్టొచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రధానంగా పవన్, జగన్, కామ్రేడ్ లను ఒకే తాటిపైకి తేవడానికి గులాబీ బాస్ రంగంలోకి దిగుతారని జాతీయ స్థాయిలో బిజెపి, కాంగ్రెస్ లేని మూడో ఫ్రంట్ తెస్తారని కూడా కెటిఆర్ చేసిన వ్యాఖ్యల వెనుక అర్ధం ఇదే అని అంటున్నారు విశ్లేషకులు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరగనుందో వేచి చూడాలి.