Mon Dec 23 2024 04:17:55 GMT+0000 (Coordinated Universal Time)
వీడియో లీక్… చిక్కుల్లో కుమారస్వామి
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చిక్కుల్లో పడ్డారు. ఆయన ఫోన్ మాట్లాడుతుండగా రికార్డు చేసిన ఓ వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. జేడీఎస్ నేత ప్రకాశ్ [more]
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చిక్కుల్లో పడ్డారు. ఆయన ఫోన్ మాట్లాడుతుండగా రికార్డు చేసిన ఓ వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. జేడీఎస్ నేత ప్రకాశ్ [more]
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చిక్కుల్లో పడ్డారు. ఆయన ఫోన్ మాట్లాడుతుండగా రికార్డు చేసిన ఓ వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. జేడీఎస్ నేత ప్రకాశ్ ను హత్య చేసిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపేయాలని, షూటౌట్ చేసేయాలని ఆయన ఎవరికో ఫోన్ లో చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో బయటకు రావడం కలకలం రేపుతోంది. అయితే, తమ నాయకుడు ప్రకాశ్ ను చంపారన్న భావోద్వేగంతోనే మాట్లాడాను కానీ కావాలని మాట్లాడలేదని కుమారస్వామి అంటున్నారు. ఇక కుమారస్వామి వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. కుమారస్వామి ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరించలేదని బీజేపీ ఆరోపించింది.
Next Story