April10-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
పాలకొండ నియోజకవర్గం జనసిన అభ్యర్ధిగా నిమ్మక జయకృష్ణను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు. ఎస్టీలకు రిజర్వు చేసిన పాలకొండ నియోజకవర్గం నుంచి మిత్రపక్షాల అభ్యర్ధిగా నిమ్మక జయకృష్ణ బరిలో నిలవనున్నారు. ఈ నియోజకవర్గం నుంచీ టికెట్ కోసం ఆశావహులు ఎక్కువగా ఉండి పోటీపడడంతో పలు దఫాలుగా జనసేన పక్షాన సర్వేలు జరిగాయని తెలిపారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Janasena : మరో జనసేన అభ్యర్థి ఖరారు
పాలకొండ నియోజకవర్గం జనసిన అభ్యర్ధిగా నిమ్మక జయకృష్ణను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు. ఎస్టీలకు రిజర్వు చేసిన పాలకొండ నియోజకవర్గం నుంచి మిత్రపక్షాల అభ్యర్ధిగా నిమ్మక జయకృష్ణ బరిలో నిలవనున్నారు. ఈ నియోజకవర్గం నుంచీ టికెట్ కోసం ఆశావహులు ఎక్కువగా ఉండి పోటీపడడంతో పలు దఫాలుగా జనసేన పక్షాన సర్వేలు జరిగాయని తెలిపారు.
MIM : భాయ్.. నీ సంగతేంటో చెప్పు.. ఏపీలోకి వస్తావా.. రావా?
తెలంగాణలో పుట్టిన ఎంఐఎం పార్టీ అన్ని రాష్ట్రాలకు విస్తరించేలా ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. అందులో కొంత సక్సెస్ అయ్యారు. మిగిలిన ప్రాంతీయ పార్టీల కంటే బెటర్ గానే కొన్ని రాష్ట్రాల్లో పార్టీ గుర్తు పై అభ్యర్థులు గెలిచేలా కూడా ఆయన శ్రమించారు.
Pawan Kalyan : పిఠాపురంలో గాజుగ్లాసుకు పొంచి ఉన్న ప్రమాదం.. వ్యూహం మార్చిన ప్రత్యర్థులు
తమిళనాడులో ఒకే పేరుగల అనేక మంది పన్నీర్ సెల్వం పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఎన్నికల బరిలోకి దిగారు. వారందరికీ ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. పన్నీర్ సెల్వంతో పాటు మరో నలుగురు పన్నీర్ సెల్వంలు కూడా నామినేషన్లు వేశారు. వారందరి ఇంటిపేర్లు ఓ అని ఉండటంతో ఓటర్లు కన్ఫ్యూజన్ అవుతారని పన్నీర్ సెల్వం అనుచరులు ఆందోళన చెందుతున్నారు.
Arvind Kejriwal : ఢిల్లీకి ముఖ్యమంత్రి ఎవరు? జైలుకెళ్లి ఇన్ని రోజులయినా ఇక అంతేనా?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఆయనను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఆయన నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి అరెస్ట్ చేశారు.
Vijayawada : మా బెజవాడోళ్లు అంతే బాబాయ్... మాతో పెట్టుకుంటే మడతెట్టేస్తాం మామా?
చాలా రోజుల క్రితం ఒక మాట వినిపించేది. విజయవాడను రాజకీయ రాజధాని అనేవాళ్లు. ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్ లో విజయవాడ వాణిజ్య రాజధాని అని పేరున్నా.. రాజకీయ రాజధాని అని పిలుచుకునే వారు. తర్వాత ఆ పేరు పోయిందనుకోండి. ఇప్పుడు చెప్పొచ్చేదేమిటంటే...? బెజవాడోళ్లు రాజకీయాల్లో హాట్ హాట్ గా ఉంటారు.
మృతదేహంతో ఎనిమిది కిలోమీటర్ల ప్రయాణం.. భుజం పై మోసుకుంటూ?
ఏజెన్సీ ప్రాంతాలంటేనే ప్రభుత్వాలకు పట్టవు. ఏ ప్రభుత్వం వచ్చినా అంతే. ఆదివాసీలను అస్సలు పట్టించుకోరు. నాగరిక సమాజానికి దూరంగా ఉండటం, ప్రశ్నించే తత్వం లేకపోవడంతో వారికి దశాబ్దాలుగా ఇబ్బందులు తప్పడం లేదు. సరైన నీటి సౌకర్యం ఉండదు. అలాగే వైద్యం అందుబాటులో ఉండదు.
Nara Lokesh : తమిళనాడులో లోకేష్ ఎన్నికల ప్రచారం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమిళనాడులో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఆయన కోయంబత్తూరు బీజేపీ ఎంపీ అభ్యర్థి, తమిళనాడు బీజేపి రాష్ర్ట అధ్యక్షుడు అన్నామలై కి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. తెలుగు ఓటర్లు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాల్లో లోకేష్ ప్రచారం నిర్వహించనున్నారు.
Breaking : ఘోర రోడ్డు ప్రమాదం.. కారు వచ్చి బైకును ఢీకొట్టి.. ఐదుగురు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. అతి వేగంగా వస్తున్న కారు బైక్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురితో పాటు బైక్ పై ఉన్న వ్యక్తి కూడా మరణించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. దీంతో రోడ్డు మొత్తం రక్తసిక్తమయింది.
Vote : ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ? ఓటు కోసం 2కే రన్
హైదరాబాద్ నగరంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వికాస్‌రాజ్ నేతృత్వంలో 2కే రన్ జరిగింది. మే 13వ తేదీన జరిగే పోలింగ్ లో అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ కూడా హాజరయ్యారు.
Breaking : వైసీపీలో చేరిన పోతిన మహేష్
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నేత పోతిన మహేష్ వైసీపీలో చేరారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి తనకు సీటు దక్కకపోవడంతో ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా పవన్ కల్యాణ్ పై కీలక విమర్శలు చేశారు.