April12-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
మూడో దశ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. మొత్తం పన్నెండు రాష్ట్రాలలో 94 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించిన నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. దీంతో పాటు మధ్యప్రదేశ్ వాయిదా పడిన వాటికి కూడా నోటిఫికేషన్ విడుదల కానుంది.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Elections : నేడు మూడో దశ ఎన్నికలకు నోటిఫికేషన్
మూడో దశ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. మొత్తం పన్నెండు రాష్ట్రాలలో 94 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించిన నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. దీంతో పాటు మధ్యప్రదేశ్ వాయిదా పడిన వాటికి కూడా నోటిఫికేషన్ విడుదల కానుంది.
Breaking : కవితకు కోర్టులో మళ్లీ చుక్కెదురు.. పిటీషన్ల తిరస్కరణ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఐదు రోజుల కస్డడీకి సీబీఐ అధికారులు కోరారు. కవితను విచారించాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం తమకు ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరింది. కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రధారి అని సీబీఐ తరుపున న్యాయవాదులు పేర్కొన్నారు.
IPL 2024 : చెత్త బౌలింగ్.. బెంగలూరు జట్టులో లోపం అదే.. అందుకే ముంబయి విజయం
నిన్న జరిగిన మ్యాచ్ చూసిన వారికి ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు జట్టు ఇప్పటి వరకూ ఛాంపియన్ కాలేదు. కానీ ఆ జట్టు ఛాంపియన్ కోరుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అందులో కింగ్ విరాట్ కోహ్లి ఉండటమే కారణం.
Ap Politics : మ్యానిఫేస్టోను ఒకరిది చూసిన తర్వత మరొకరు రిలీజ్ చేస్తారా.. సీన్ అయితే అలానే ఉంది సామీ
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడ్డాయి. మరో నెల రోజులు మాత్రమే పోలింగ్ ఉంది. వచ్చే నెల 13వ తేదీన పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకూ ప్రధాన పార్టీలు తమ మ్యానిఫేస్టోను విడుదల చేయలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా మ్యానిఫేస్టో కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.
Hyderabad Water Crisis : థాంక్ గాడ్.. మూడు నెలలు ముహూర్తాల్లేవ్ ... కొంత వరకూ నీటి ముప్పు తప్పినట్లే
కరకంగా ఈ సమ్మర్ లో మూఢమి రావడం మంచే జరుగుతుంది. పెళ్లిళ్లకు ముహూర్తాలు లేవనే బాధ తప్పించి పెద్ద బాధ నుంచి హైదరాబాద్ నగరం తప్పించుకున్నట్లయింది. ఇప్పటికే జలాశయాలు పూర్తిగా ఎండి పోయాయి. భూగర్భజలాలు అడుగంటి పోయాయి. హైదరాబాద్ లో నీటి సమస్య తీవ్రం కానుంది.
నాగర్ కర్నూలు జిల్లాలో మళ్లీ చిరుత కలకలం
నాగర్ కర్నూలులో చిరుత సంచారం కలకలం రేపుతుంది. నాగర్ కర్నూలు జిల్లాలోెని బిజినేపల్లి మండలం కేంద్ర సమీపంలో నిన్న రాత్రి మళ్లీ చిరుతపులి పశువులపై దాడి చేసింది. ఒక దూడను బలికొనింది. గ్రామంలో ఒక రైతు తన వ్యవసాయ పొలంలో పశువులను కట్టేసి ఇంటికి వెళ్లాడు. అయితే తిరిగి వచ్చి చూడగా చిరుత దాడి చేసినట్లు కనుగొన్నాడు.
ఆన్ లైన్ గేమ్‌కు అలవాటు పడి ఆ యువతి ఏం చేసిందంటే?
హైదరాబాద్ లో ఆన్ లైన్ గేమ్స్‌తో యువతి అప్పులపాలయిన ఘటన వెలుగు చూసింది. డబ్బుకోసం సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ జై భీమ్ న్యూస్ రాజేంద్రనగర్‌లో జరిగింది. డిగ్రీ చదువుతున్న ఒక యువతి కోసం తల్లిదండ్రులు ఆమెకు లాప్ ట్యాప్‌తో పాటు మొబైల్ ఫోన్ కొనిచ్చారు.
Breaking : ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల
ఇంటర్ పరీక్ష ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో విడుదలయ్యాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ లో 78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి విడుదల చేశారు. ఈ ఏడాది 9.99 లక్షల మంది ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారని తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ లో 67 శాతం విద్యర్థులు ఉత్తీర్ణులయ్యారు.
Ys Jagan : 22న జగన్ నామినేషన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 22వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. పులివెందుల నియోజకవర్గంలో ఆయన తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. ఈ నెల 21వ తేదీతో మేమంతా బస్సు యాత్ర పూర్తి కానుంది. గత నెల 27వ తేదీన ఇడుపులపాయలో ప్రారంభమైన మేమంతా ిసిద్ధం బస్సు యాత్ర ఈ నెల 21వ తేదీన ఇచ్ఛాపురంలో ముగియనుంది.
నేడు శిరోముండనం కేసులో విశాఖ కోర్టు తీర్పు
నేడు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఇరవై ఎనిమిదేళ్ల నాటి కేసులో సంచలన తీర్పు వెలువడనుంది. శిరోముండనం కేసులో నేడు విశాఖ న్యాయస్థానం తన తీర్పు వెలువరించనుంది. రామచంద్రాపురంలో దళితుడి శిరోముండనం కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం నేడు వెలువరించనునంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 1996 డిసెంబరు 29న ఈ ఘటప జరిగింది. విచారణ బుధవారం పూర్తయింది.