12June-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 17 మంది వారికి కొత్త వారికి అవకాశం కల్పించారు. చంద్రబాబు కేబినెట్ లో ముగ్గురు మహిళలకు ఛాన్స్ దొరికింది. జనసేనకు మూడు, బీజేపీకి ఒకటి మంత్రి పదవులు ఇచ్చారు. మరొక స్థానం ఖాళీగా ఉంది.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Babu Cabinet : చంద్రబాబు కేబినెట్ ఇదే
చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 17 మంది వారికి కొత్త వారికి అవకాశం కల్పించారు. చంద్రబాబు కేబినెట్ లో ముగ్గురు మహిళలకు ఛాన్స్ దొరికింది. జనసేనకు మూడు, బీజేపీకి ఒకటి మంత్రి పదవులు ఇచ్చారు. మరొక స్థానం ఖాళీగా ఉంది.
Andhra Pradesh Cabinet : ఆ ఒక్కటీ అందుకోసమే అట్టిపెట్టారా? అయితే ఇప్పుడు మంత్రి పదవి ఎందుకు ఆపినట్లు?
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. చంద్రబాబుతో పాటు నలుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మరో మంత్రి పదవి ఖాళీగా ఉంది.కొణతాల రామకృష్ణ సీనియర్ నేత. ఆయనకు చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి గ్యారంటీ అనుకున్నారు. విశాఖ జిల్లా నుంచి వంగలపూడి అనిత ఒక్కరే మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. విశాఖ లాంటి జిల్లాకు ఒక్కరే మంత్రి పదవి అని ఎవరూ ఊహించని విషయం.
Chandrababu Oath : చంద్రబాబు అను నేను
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. అతిరధ మహారధులు వివిధ ప్రాంతాల నుంచి తరలి రాగా చంద్రబాబు నాయుడు సరిగ్గా 11.27 గంటలకు నిర్ణయించిన ముహూర్తానికి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
Andhra Pradesh Cabinet : కుటుంబాలను.. కుటుంబాలనే పక్కన పెట్టారే.. ఎందుకిలా?
చంద్రబాబు నాయుడు ఈసారి మంత్రి వర్గ కూర్పులో విన్నూత్న తరహాను అవలంబించారు. సిన్సియారిటీ, సీనియారిటీ అన్నది కూడా పెద్దగా చూడలేదు. అలాగే రాజకీయాల్లో ప్రతిష్ట కలిగిన కుటుంబాలను కూడా మంత్రి వర్గంలోకి తీసుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేశారు.
Chandrababu Cabinet : కేబినెట్ లో పక్కన పెట్టడానికి అసలు రీజన్ ఇదేనా? యనమల లేని కేబినెట్ ఇదే ఫస్ట్
చంద్రబాబు నాయుడు ఈసారి కేబినెట్ లో సీనియర్ నేతలకు మొండి చేయి చూపించారు. సీనియర్ నేతలు ఎవరినీ ఈసారి పరిగణనలోకి తీసుకోలేదు. యనమల రామకృష్ణుడు నుంచి మొదలు పెడితే... అమర్నాధ్ రెడ్డి వరకూ ఎవరికీ తన మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీలోకి యువరక్తం ఎక్కించాలన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు ఈ రకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
Pawan Kalyan : పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పవన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కల్యాణ్ తొలిసారి చట్టసభలోకి ప్రవేశించి తొలి సారి మంత్రి అయ్యారు. ఇప్పటి వరకూ వెండి తెరపై ఏలిన పవన్ కల్యాణ్ ఇక ఏపీ రాజకీయాల్లోనూ తనదైన మార్క్ ను చూపెడతారని జనసైనికులు భావిస్తున్నారు.
Telangana : తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలట
తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో భారీ వర్షాలు మూడురోజుల పాటు కురిసే అవకాశముందని తెలిపింది. తెలంగాణలో నైరుతి రుతు పవనాల రాకతో మూడు రోజులు పాటు కొద్ది చోట్ల భారీగా, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
జూన్ 24 నుంచి పార్లమెంటు సమావేశాలు
జూన్ 24వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లోక్సభభ ఎన్నికలు పూర్తయిన తర్వాత తొలి పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో ఈ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి కూడా విపక్షం కూడా బలంగా ఉండటం ఈ సమావేశాల ప్రత్యేకత అని చెప్పాలి.
నాడు జగన్ కాదన్న నేతలకు నేడు చంద్రబాబు మంత్రి పదవి
గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ మంత్రి పదవులు ఇవ్వని వారు నేడు చంద్రబాబు కేబినెట్ లో చోటు సంపాదించుకున్నారు. సీనియర్ నేతలయినా జగన్ నాడు పక్కన పెట్టడంతో అసంతృప్తితో బయటకు వెళ్లిపోయి టీడీపీలో చేరి మొన్నటి ఎన్నికలలో గెలిచి మంత్రి పదవులను దక్కించుకున్నారు. పార్టీ మారిన వారికి ఇద్దరికి చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారు.