12 August-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
తిరుమల ఘాట్ రోడ్డులో రాత్రి వేళ టూవీలర్లకు ప్రవేశంపై నిషేధం విధించారు. సెప్టంబరు 30వ తేదీ వరకూ ఈ నిషేధాజ్ఞలు విధించారు. వర్షాలు కురుస్తుండటంతో పాటు అడవిలో ఉన్న చిరుతపులులు రహదారులపైకి వచ్చే అవకాశముందని అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Tirumala : తిరుమల ఘాట్ రోడ్డులో ఆంక్షలు.. రాకపోకలపై నిషేధం
తిరుమల ఘాట్ రోడ్డులో రాత్రి వేళ టూవీలర్లకు ప్రవేశంపై నిషేధం విధించారు. సెప్టంబరు 30వ తేదీ వరకూ ఈ నిషేధాజ్ఞలు విధించారు. వర్షాలు కురుస్తుండటంతో పాటు అడవిలో ఉన్న చిరుతపులులు రహదారులపైకి వచ్చే అవకాశముందని అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు.
Liqour New Rates In Andhra Pradesh : లిక్కర్ రేట్లు తగ్గుతున్నాయోచ్... ఇక పెగ్గుమీద పెగ్గు వేసియండి బ్రో
ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ బాటిల్స్ ధరలు తగ్గుతున్నాయి. త్వరలోనే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అక్టోబరు నెల నుంచి నూతన ఎక్సైజ్ పాలసీని అమలు చేయాలని కొత్తగా ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తక్కువ ధరకు నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
Telangana : తెలంగాణ రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పనున్న రేవంత్ సర్కార్
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇప్పటికే రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఆగస్టు 15వ తేదీ నాటికి పూర్తి చేయనుంది. దీంతో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మేరకు తాము రైతు రుణమాఫీ ఏకకాలంలో చేశామని తెలంగాణ ప్రభుత్వం చెప్పుకునేందుకు అవకాశం దక్కింది.
Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో మహిళలు టిక్కెట్ లేని ప్రయాణం ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నేడు క్లారిటీ రానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు రవాణా శాఖ అధికారులతో సమీక్ష చేయనున్నారు.హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న చంద్రబాబు నేరుగా అమరావతికి చేరుకుని ఉదయం పదకొండు గంటలకు అధికారులతో సమావేశమవుతారు.
చిక్కుల్లో ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్
ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ చిక్కుల్లో పడ్డారు. ఆమెపై హైకోర్టులో ప్రజా ప్రయోజనం వ్యాజ్యం దాఖలయింది. ఈ పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ ఇటీవల దివ్యాంగుల విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ లుగా దివ్యాంగులకు రిజర్వేషన్లను తీసి వేయాలన్నారు.
Kejrival : కేజ్రీవాల్ కూడా బెయిల్ కోసం సుప్రీంకు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన పిటీషన్ దాఖలు చేశారు. ఇటీవల హైకోర్టు అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరయింది.
Peacock Curry: ఎంచక్కా నెమలి కూర వండి.. వీడియోను అప్లోడ్ చేశాడు
వన్యప్రాణులను కాపాడాలంటూ ఓ వైపు ప్రభుత్వం, అధికారులు, ఎన్జీవోలు పిలుపును ఇస్తున్నప్పటికీ.. కొందరు మాత్రం ఏకంగా వాటిని వండేసి యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నారు. వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (WCCB) చట్టవిరుద్ధంగా వేటాడటం, రక్షిత వన్యప్రాణులను వండడాన్ని అడ్డుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా..
Hyderabad : హైదరాబాద్ లో కుండపోత వాన.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల పాటు అతి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిచింది. నిన్న రాత్రి నుంచే హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తుంది. నిన్న అర్థరాత్రి నుంచి ఉదయం వరకూ ఇంకా వర్షం కురుస్తూనే ఉంది.
Road Accident : అరుణాచలం వెళ్లి వస్తుండగా కారు ప్రమాదం.. ఆంధ్ర విద్యార్థులు ఐదుగురు మృతి
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏడుగురు విద్యార్థులు మరణించారు. వీరంతా రాష్ట్రంలోని అనేక జిల్లాలకు చెందిన విద్యార్థులు చెన్నై సమీపంలోని ఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నారు.
ఏపీ రైతులకు గుడ్ న్యూస్... బకాయిలన్నీ నేడు విడుదల
నేడు ఆంధ్రప్రదేశ్ రైతులకు ధాన్యం బకాయిలను ప్రభుత్వం విడుదల చేయనుంది. గత రబీలో విక్రయించిన ధాన్యానికి సంబంధించిన బిల్లులను క్లియర్ చేయనున్నారు. దీంతో దాదాపు 35,374 మంది రైతులు లబ్డి పొందనున్నారు. వీరికి 674.47 కోట్ల రూపాయల బకాయిలను ఇవాళ మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేయనున్నారు.