March 13-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
గ్రూప్-1 మెయిన్స్ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షపై రాష్ట్ర హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. గతంలో జరిగిన మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది. జవాబు పత్రాలను మాన్యువల్ విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
High Court : గ్రూప్ వన్ పరీక్ష రద్దు.. హైకోర్టు తీర్పు ఎందుకంటే?
గ్రూప్-1 మెయిన్స్ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షపై రాష్ట్ర హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. గతంలో జరిగిన మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది. జవాబు పత్రాలను మాన్యువల్ విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
Meera Chopra : ప్రేమ పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్..
పవన్ కళ్యాణ్ 'బంగారం' సినిమాలో నటించిన హీరోయిన్ మీరా చోప్రా.. ప్రేమ పెళ్లితో మ్యారేజ్ లైఫ్ ని స్టార్ట్ చేసారు. ప్రియాంక చోప్రా కజిన్ అయిన మీరా చోప్రా తమిళ చిత్రంతో యాక్టింగ్ కెరీర్ ని స్టార్ట్ చేసారు. ఆ తరువాత రెండో చిత్రంగా పవన్ తో బంగారంలో నటించి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. తమిళంలో ఎక్కువ సినిమాలు చేసిన ఈ హీరోయిన్.. తెలుగులో వాన, మారో, గ్రీకువీరుడు సినిమాలు మాత్రమే చేసారు.
Corona Virus : కరోనా మళ్లీ మాయమయినట్లేనా..? వారికి అవసరమైనప్పుడే కేసులు వస్తాయా?
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు మళ్లీ కనిపించడం లేదు. కరోనాకు సంబంధించి అప్డేట్ కూడా ఇవ్వడం లేదు. దీంతో కరోనా ముప్పు తప్పినట్లేనని అభిప్రాయపడుతున్నారు. జనవరి, ఫిబ్రవరి నెల వరకూ కరోనా కేసులు అన్ని రాష్ట్రాల్లో నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రధానంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదయినట్లు కూడా గణాంకాలు తెలిపాయి. JN 1 సబ్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని కూడా తెలిపింది.
Bengaluru : బెంగళూరు కథ ముగిసినట్లేనా.. దీనికి అంతటికీ కారణం అదేనా? కార్లు కడిగినా ఫైనేనట
అవును.. సామర్థ్యానికి మించి జనాభా పెరిగితే ఏ నగరమైనా తట్టుకుంటుందా? చిన్న పాటి వాహనంలో ఎక్కువ మంది ప్రయాణిస్తేనే అది మొరాయిస్తుంది. వాహనమైనా.. నగరమైనా ఒకటే.. హైదరాబాద్ కంటే ముందు బెంగళూరు నగరం ఒక కూల్ ప్లేస్. చాలా మంది బెంగళూరులో సెటిల్ అవ్వాలని కలలు కనే వారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వలస వెళ్లారు. అక్కడ వ్యాపార రంగాల్లో స్థిరపడిన వారు అనేక మంది ఉన్నారు.
Pirates : నౌకను ఎత్తుకెళ్లిపోయారు.. ఆ నౌకలో 23 మంది సిబ్బంది ఉన్నా.. సముద్రపు దొంగలు
సముద్రపు దొంగలు రెచ్చిపోతున్నారు. సముద్రంలో ప్రయాణించే నౌకలను హైజాక్ చేసి సొమ్ము చేేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన ఒక నౌకన్ హిందూమహాసముద్రంలో సముద్రపు దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగినట్లు తెలిసింది.
కామెర్ల వ్యాధి ఎందుకు వస్తుంది? ఇది వస్తే కళ్లు పచ్చగా ఎందుకు మారుతాయి?
సినీ నిర్మాత, తెలుగు బిగ్ బాస్ ఫేమ్ సూర్య కిరణ్ కన్నుమూశారు. అతని వయస్సు 51 సంవత్సరాలు. కామెర్లుతో బాధపడుతూ మరణించాడు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. కామెర్లు అంటే ఏమిటి ? అది ఎలా ప్రాణాంతకంగా మారుతుందో తెలుసుకుందాం.
Temperatures : ఎండలు మండిపోతున్నాయ్.. జాగ్రత్త పడకపోతే ఇక అంతేనట
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చి నెలలలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. మార్చి నెలలోనే ఇలా ఉ:టే ఇక మే నెలలో ఎలా ఉంటుందని ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. వాతావరణంలో తేమ శాతం కూడా తగ్గడంతో వేడి గాలులు కూడా ఎక్కువగా వీస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మార్చి నెలలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరుతుండటంతో ఉదయం పది గంటలు దాటితే బయటకు రావడానికే ప్రజలు భయపడి పోతున్నారు.
Revanth Reddy : నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. అభ్యర్థుల ఎంపికపై
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన పార్టీ నిర్వహించే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొంటారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే జాతీయ స్థాయిలో అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధినాయకత్వం విడుదల చేస్తుంది. ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసింది.
Narendra Modi : తెలంగాణలో మూడు రోజులు మోదీ.. పర్యటించేది ఇక్కడే
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ ఖరారయింది. దక్షిణాది రాష్ట్రాలో ఐదు రోజుల పాటు మోదీ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారకని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఒకే రోజు మూడు సభల్లో పాల్గొనేలా పార్టీ ప్లాన్ చేసింది. తెలంగాణలో మూడు రోజుల పాటు నరేంద్ర మోదీ పర్యటించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Modi Cabinet : చివరి కేబినెట్.. ఎలాంటి నిర్ణయాలు ఉంటాయంటే?
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈ టర్మ్‌కు ఇదే చివరి మంత్రి వర్గ సమావేశం కావడంతో ఎన్నికలకు ముందు మంత్రి వర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.