14August-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా ముడిసరుకు పేలి ఇద్దరు మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. బాణాసంచా కేంద్రంలోనే ఈ పేలుడు సంభవించింది. లారీ నుంచి ముడిసరుకును కిందకు దించుతుండగా పెద్దయెత్తున పేలుడు సంభవించి ఇద్దరు మరణించారని అధికారులు తెలిపారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
తమిళనాడులో విషాదం.. బాణాసంచా సామగ్రి పేలి ఇద్దరు మృతి
తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా ముడిసరుకు పేలి ఇద్దరు మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. బాణాసంచా కేంద్రంలోనే ఈ పేలుడు సంభవించింది. లారీ నుంచి ముడిసరుకును కిందకు దించుతుండగా పెద్దయెత్తున పేలుడు సంభవించి ఇద్దరు మరణించారని అధికారులు తెలిపారు.
TDP : సీనియర్లకు మళ్లీ షాకిచ్చే ఆలోచనలో టీడీపీ అధినేత చంద్రబాబు.. వారిని వదిలించుకుంటున్నారా?
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి యాభై ఏళ్లవుతుంది. ఆ పార్టీలో కావాల్సినంత మంది సీినియర్లున్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా సీనియర్ నేతలే. 2019 వరకూ చంద్రబాబు సీనియర్లకు ప్రయారిటీ ఇచ్చేవారు. ఏ విషయంలోనైనా వారి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్లేవారు.
Aravind Kejrival : సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు నిరాశ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో మరోసారి షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈరోజు బెయిల్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగింది. అయితే కేజ్రీవాల్ వేసిన పిటీషన్ పై సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీలు బంద్
నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ విభాగంలో సేవలను నిలిపివేయనున్నట్లు జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ తెలిపింది. ఈరోజు మాత్రమే ఈ సేవలను బంద్ చేయనున్నట్లు తెలిపింది. కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం జరిగిన నేపథ్యంలో వైద్య కళాశాలల్లో భద్రతకు సంబంధించి జాతీయ వైద్య కమిషన్ కీలక సూచనలు అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది.
Revanth Reddy : నేడు హైదరాబాద్ కు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్ రానున్నారు. ఆయన దాదాపు పది రోజులకు పైగానే విదేశాల్లో పర్యటించి తెలంగాణకు రానున్నారు. అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించిన రేవంత్ రెడ్డి బృందం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పలువురు పారిశ్రామికవేత్తలను, వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశాలను నిర్వహించింది.
Anil Kumar Yadav : పొడుస్తాను.. చెండాడుతాను అన్న అనిల్ ఏమైపోయాడబ్బా.. కంటికి కూడా కనిపించడం లేదుగా?
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఎవరికీ దొరకడం లేదు. అస్సలు కనపడటం లేదు. పార్టీ కార్యక్రమాలను కూడా పట్టించుకోవడం లేదు. అనిల్ కుమార్ యాదవ్‌ను రాజకీయాల్లో ఒక పడిలేచిన కెరటంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే అయ్యారు.
Nallari Kiran Kumar Reddy : ఈయనేందయ్యా ..బాబూ.... జిల్లాలను కలిపేస్తానంటున్నాడు... అందుకేగా?
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారాయి. తాను సీఎంను అయి ఉంటే జిల్లాలను కలిపేసి ఉండేవాడినని,జిల్లాలను విభజించి గత ప్రభుత్వం తప్పు చేసిందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లాలను కొత్త వాటిని ఎందుకు చేస్తారో తెలుసా?
Andhra Pradesh : రేపటి నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్
ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలను బంద్ చేస్తున్నట్లు ప్రయివేటు స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ తెలిపింది. తమకు చెల్లించాల్సిన బకాయీలను ప్రభుత్వం చెల్లించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆరోగ్య శ్రీ బకాయీలను ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది.
Tirumala : శ్రీవారి దర్శనం కోసం నవంబరు నెల కోటా ఆన్లైన్ లో విడుదల ఎప్పుడంటే?
నవంబరు నెల కోటాను ఆగస్టు 19న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆగస్టు 21న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు ఆగస్టు 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.
Breaking : తెలంగాణ నేతలకు షాకిచ్చిన హైకమాండ్.. అధికారిక ప్రకటన
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. తెలంగాణ రాజ్యసభ పదవిని అభిషేక్ మను సింఘ్వికి ఛాన్స్ ఇచ్చింది. ఆయనను ఎంపిక చేసినట్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ సింఘ్విని ఎంపిక చేయడంతో స్థానిక కాంగ్రెస్ నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.