March15-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
మణిపూర్‌లో భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారు జామున జరిగిన భూప్రకంపనలకు ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 6.56 గంటలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేల్ పై 3.9 తీవ్రతగా నమోదయింది.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Manipur Earth Quake : మణిపూర్‌లో భూకంపం.. తీవ్రత ఎంతంటే?
మణిపూర్‌లో భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారు జామున జరిగిన భూప్రకంపనలకు ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 6.56 గంటలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేల్ పై 3.9 తీవ్రతగా నమోదయింది.
Ram Charan : ఈ ఇయర్ రామ్ చరణ్ బర్త్ డేకి.. ఫ్యాన్స్‌కి పండగే..
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమాల విషయంలో ప్రస్తుతం స్పీడ్ పెరిగినట్లు కనిపిస్తుంది. ఇన్నాళ్లు నత్త నడకన నడిచిన 'గేమ్ ఛేంజర్' సినిమా.. ఇప్పుడు షెడ్యూల్ తరువాత షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంటూ ముందుకు కదులుతుంది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం వైజాగ్ ఆర్కే బీచ్ లో షూటింగ్ జరుపుకుంటుంది.
Petrol : వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్... నేటి నుంచే...పెట్రోలుపై ఇంత తగ్గింపా?
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు ఊరట నిచ్చే వార్త చెప్పింది. పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్ లీటర్ కు రెండు రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సవరించిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి
Kavitha : కవిత ఇంట్లో ఈడీ సోదాలు అందుకేనా?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు నేరుగా ఆమె నివాసానికి వెళ్లి అక్కడి నుంచి ఆమె వ్యక్తిగత సిబ్బందిని, సెక్యూరిటీని పంపించి వేసి సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. కవిత నివాసంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. కవితకు సంబంధించిన రెండు ఫోన్లను అధికారుల సీజ్ చేశారు.
ఎన్నికల వేళ..హెలికాప్టర్, చార్టర్డ్ విమానాలకు గంటకు అద్దె ఎంతో తెలుసా?
ప్రస్తుతం దేశంలో ఎన్నికలు రానున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు బిజీబిజీగా గడుపుతారు. అయితే ఎన్నికలు రాగానే తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రచారం చేసేలా ప్లాన్ చేస్తుంటారు ఆయా పార్టీల నాయకులు. ఎన్నికల్లో అడ్డగోలుగా ఖర్చు పెడుతుంటారు. ఎంత ఖర్చు అయినా పెట్టేందుకు సిద్ధమవుతుంటారు.
Venkatesh : వెంకటేష్ కూతురి పెళ్లి సెలబ్రేషన్స్‌లో.. మహేష్ బాబు ఫ్యామిలీ..
టాలీవుడ్ హీరో వెంకటేష్ గత ఏడాది అక్టోబర్ లో తన రెండో కుమార్తె నిశ్చితార్థం వేడుక జరుపుకున్న సంగతి తెలిసిందే. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుటుంబంలోని కుర్రాడికి.. వెంకటేష్ తన కూతుర్ని ఇస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 25న హైదరాబాద్ లోని ఒక హోటల్ లో చాలా సింపుల్ గా ఈ దగ్గుబాటి నిశ్చితార్థం వేడుక జరిగింది.
ఉండవల్లిలో నేడు పిఠాపురం పంచాయతీ
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను చంద్రబాబు తన నివాసానికి పిలిచారు. ఈరోజు తనతో సమావేశానికి రావాలని వర్మకు చంద్రబాబు ఫోన్ చేసి చెప్పారు. అయితే తాను చంద్రబాబును కలుస్తానని వర్మ చెబుతున్నారు. తన అనుచరులు, టీడీపీ నేతలు ఈరోజు పిఠాపురంలో సమావేశం పెట్టుకున్నారని, ఆ సమావేశం తర్వాత తాను వచ్చి కలుస్తానని చెప్పారు. దీంతో పిఠాపురంలో వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న టెన్షన్ నెలకొంది.
Telangana Vehicle Registration : నేడు TS నుంచి TGగా నెంబర్లు మార్పు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయాల్లో టీఎస్ నుంచి టీజీగా వాహన రిజిస్ట్రేషన్ల నెంబర్లను మార్చడం. ఈ ప్రక్రియ నేటి నుంచి అమలులోకి రానుంది. నేటి నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే అన్ని వాహనాలకు TS నుంచి TGగా మారుస్తూ రవాణా శాఖ నెంబర్లను జారీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతి రావడంతో నేటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ తో వాహనాల నెంబర్లు తెలంగాణలో దర్శనమివ్వనున్నాయి.
Breaking : రేపు ఎన్నికల షెడ్యూల్.. మీడియాకు ప్రెస్‌మీట్ ఉందంటూ?
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రేపు విడుదల కానుంది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విలేకర్ల సమావేశం ఉందని మీడియాకు ఎన్నికల కమిషన్ నుంచి సమాచారం అందింది. దీంతో రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసోం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కానుంది.
Breaking Mudragada Padmanabam : వైసీపీలో చేరిన ముద్రగడ.. దశాబ్దకాలం తర్వాత మెడలో పార్టీ కండువా
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ముద్రగడను పార్టీలోకి సాదరంగా జగన్ ఆహ్వానించారు. వైసీపీ కండువా కప్పిన జగన్ ముద్రగడను ఆలింగనం చేసుకున్నారు. ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు.