15May-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
జమ్మలమడుగులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిల మధ్య విసురుకున్న సవాళ్లు మరింత అగ్గిన రాజేశాయి. దీంతో ఇద్దరినీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని కూడా పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. ఎవరినీ ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు వారిపై ఆంక్షలు విధించారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ ఆఫీసుల వద్ద కూడా పోలీసులు భారీగా మొహరించారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Jammalamadugu : జమ్మలమడుగులో హైటెన్షన్.. అందరూ హౌస్ అరెస్ట్
జమ్మలమడుగులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిల మధ్య విసురుకున్న సవాళ్లు మరింత అగ్గిన రాజేశాయి. దీంతో ఇద్దరినీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని కూడా పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. ఎవరినీ ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు వారిపై ఆంక్షలు విధించారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ ఆఫీసుల వద్ద కూడా పోలీసులు భారీగా మొహరించారు.
Ap Elections : ఇదేంది సామీ.. బెట్టింగ్ ఇన్ని ఇకోట్లా.. పోతే ముసుగేసుకోవాల్సిందేగా..?
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసింది. ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. గెలుపు తమదేనని ఎవరికి వారే చెప్పుకుంటున్నారు. కానీ ఓటర్ల నాడి మాత్రం ఈసారి ఎవరికీ అందకుండా ఉంది. పోలింగ్ అయితే పూర్తయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ పర్సంటేజీ నమోదయింది. ఎంతగా అంటే.. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి రెండు గంటల దాటిన తర్వాత కూడా ఓటర్లు ఉన్నారంటే ఏ స్థాయిలో పోలింగ్ జరిగిందో చెప్పాల్సిన పనిలేదు.
Ap Politics : కుప్పం ఎవరికి అక్కుం.. బక్కుం.. ఇన్ని ఓట్ల పోలయితే ఎవరిని దెబ్బేయనుందో తెలుసా?
కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఈసారి ఓడిస్తామని వైసీపీ శపథం చేసింది. అలాగే లక్షకు పైగా మెజారిటీతో కుప్పంలో ఈసారి గెలుస్తానని చంద్రబాబు ప్రతిన బూనారు. దీంతో కుప్పం నియోజకవర్గంలో ఎవరి మాట నెగ్గుతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అందుకే కుప్పంలో మెజారిటీపై కూడా భారీ స్థాయిలో బెట్టింగ్ లు జరుగుతున్నాయి. అందుకే కుప్పం నియోజకవర్గం వైపు అందరి చూపు ఉంది.
Ap Politics : క్రాస్ ఓటింగ్ భయం.. నేతలకు కంటి మీద కునుకులేకుండా చేస్తుందట.. ఈ నియోజకవర్గాల్లోనే?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. నేతల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అయితే ఫలితాలు రావడానికి ఇంకా సమయం ఉంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందన్న ఫీడ్ బ్యాక్ తో నేతల కంటి మీద కునుకు లేకుండా పోయింది. అసెంబ్లీకి ఒక గుర్తుపైన ఓటు వేసిన వారు పార్లమెంటుకు వచ్చేసరికి మరో గుర్తుపై వేశారంటున్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన ఏజెంట్లు, ముఖ్య కార్యకర్తల నుంచి వచ్చిన సమాచారంతో క్రాస్ ఓటింగ్ పెద్దయెత్తున జరిగిందని చెబుతున్నారు.
IPL 2024 : ఢిల్లీ గెలిచింది..కాని ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే.. చాలా జరగాల్సిందేగా?
ఐపీఎల్ సీజన్ లో ప్రారంభంలో అంచనాలు అతి తక్కువగా ఉన్న జట్టు ఏది అంటే అది ఢిల్లీ కాపిటల్స్ అని మాత్రమే చెప్పాలి. కెప్టెన్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడి సుదీర్ఘకాలం తర్వాత కోలుకుని ఐపీఎల్ లోనే ఢిల్లీ కాపిటల్స్ తో మళ్లీ గేమ్ మొదలుపెట్టడంతో గతంలో ఉన్న వేగం, పెర్ఫార్మెన్స్ ఉంటాయా? అన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి.
Macherla : రాత్రికి మళ్లీ దాడులు జరిగే అవకాశం.. అలెర్ట్ అయిన పోలీసులు
ఈరోజు రాత్రి మాచర్లలో దాడులు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసుల అలెర్ట్ అయ్యారు. దీంతో పోలీసులు పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ విధించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మాచర్లతో పాటు పల్నాడు జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు కలెక్టర్ సమీక్షిస్తున్నారు. వెంటనే 144 సెక్షన్ అమలు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Ap Elections : గోదారి ఆశలు గల్లంతయినట్లేనా.. అనుకున్న ప్లాన్ వర్క్ అవుట్ కాలేదా?
ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే వారికే అధికారం వస్తుంది. కొన్ని దఫాల నుంచి ఇదే జరుగుతుంది. అందుకే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పట్టు కోసం అన్ని పార్టీలూ ప్రయత్నిస్తాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో మొత్తం 34 స్థానాలున్నాయి. అయితే ఇందులో అత్యధికంగా స్థానాలను గెలుచుకోవాలని టీడీపీీ తొలి నుంచి ఒక ప్లాన్ ప్రకారం వెళ్లింది.
సైనికుల కోసం.. మేమున్నామంటూ.. మోదీ సత్కారం
సియాచిన్ ప్రాంతంలో సైనికులకు అండగా నిలిచేందుకు కృషి చేసిన యోగేష్, సుమీధాలను ప్రధాని అభినందించారు. పూనేకు చెందిన వీరు సైనికుల కోసం తమ సొంత డబ్బుతో ఆక్సిజన్ ప్లాంట్ ను నిర్మించారు. వారు పొదుపు చేసుకున్న మొత్తం నుంచి వెచ్చించి ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టి సైనికులకు అండగా నిలిచారు. ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం కోసం తాము పొదుపు చేసిన మొత్తం సరిపోకపోవడంతో వారి వద్ద ఉన్న బంగారు నగలను కూడా విక్రయించారు.
పల్నాడుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ
పల్నాడు జిల్లాలో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడేందుకు జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక కమిటీని నియమించారు. ఈ కమిటీ అక్కడకు వెళ్లి టీడీపీ కార్యకర్తలకు అండగా నిలవాలని చంద్రబాబు నేతలను ఆదేశించారు.
ఎన్నికల అనంతర హింసపై ఈసీ సీరియస్
ఎన్నికల అనంతరం జరుగుతున్న హింసపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. పోలింగ్ జరిగి మూడు రోజులయినా ఇంకా ఘర్షణలు కొనసాగుతుండటంపై నివేదిక కోరింది. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వెంటనే ఘర్షణలను అదుపులోకి తీసుకుని శాంతిభద్రతలను పర్యవేక్షించాలని డీజీపీ, చీఫ్ సెక్రటరీలను ఆదేశించింది.